Upasana: కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన
Hyderabad: ఇటీవల రామ్ చరణ్ (ram charan), ఉపాసన (upasana) దంపతులు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. తండ్రి అవ్వడానికి మించిన ఆనందం మరొకటి లేదని, త్వరలో పాప పేరు వెల్లడిస్తామని చరణ్ తెలిపారు. అయితే అపోలో హాస్పిటల్‌లో డెలివరీకి ముందు ఉపాసనను (upasana) వీల్‌ఛైర్‌లో కూర్చోపెట్టుకుని తీసుకెళ్తుండగా ఆమె కన్నీరుపెట్టుకున్నారు. తొలిసారి తల్లికాబోతున్నానన్న ఆనందంతో ఉపాసన (upasana) ఏడ్చేసారు. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోపక్క రామ్ చరణ్ (ram charan) పక్కనే ఉండి.. కాసేపట్లో బిడ్డను ఎత్తుకోబోతున్న ఆనందంలో ఉపాసనకు ధైర్యం చెప్తూ ఉన్నారు. కొన్ని నెలల పాటు రామ్ చరణ్ ఎలాంటి షూటింగ్‌లకు వెళ్లడంలేదు. పాపతో తన భార్యతో కలిసి ఈ ఆనంద క్షణాలను ఆస్వాదించాలని అనుకుంటున్నారట.