Salaar పార్ట్ 2 చూస్తేనే అర్థ‌మ‌వుతుంది

Salaar: ప్ర‌భాస్ (prabhas) న‌టించిన స‌లార్ సినిమా కాన్సెప్ట్ చాలా మందికి అర్థంకాలేద‌ని కామెంట్స్ పెడుతున్నారు. అస‌లు స్టోరీలో ఏం చెప్పాల‌నుకుంటున్నారో అర్థంకాక ప్ర‌భాస్‌ని చూస్తూ ఉండిపోయామ‌ని అంటున్నారు. దీనిపై ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ (prashanth neel) స్పందిస్తూ.. పార్ట్ 2 చూస్తేనే స‌లార్ అర్థ‌మ‌వుతుందని.. అర్థ‌మైన‌వారికి పార్ట్ 2 చూస్తే గూస్‌బంప్స్ వ‌స్తాయ‌ని అన్నారు.

“”స‌లార్ సినిమా అనేది ఆరు గంట‌ల స్టోరీ. ఇప్పుడు రిలీజ్ అయింది 3 గంట‌ల క‌థ మాత్ర‌మే. ఇంకా మూడు గంట‌ల క‌థ మిగిలే ఉంది. ప్ర‌జ‌ల‌కు అర్థంకాని క‌థతో నేను సినిమాలు తీయ‌ను. పార్ట్ 2 చూస్తారుగా. అప్పుడు చెప్పండి “” అని తెలిపారు.