Naatu Naatu: రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ సైనికుల మాస్​ స్టెప్పులు!

Ukraine: దర్శకధీరుడు రూపొందించిన RRR సినిమా రిలీజ్ అయ్యి ఏడాది పైనే అవుతోంది. అయినా ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఈ సినిమా మానియా తగ్గట్లేదు. జపాన్ లో ఇప్పటికీ హౌస్​ఫుల్​ కలెక్షన్లతో సంచలనాలు సృష్టిస్తుంది. యంగ్​ టైగర్​ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్​స్టార్​ రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రల్లో నటించిన విజువల్​ వండర్​గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎం ఎం కీరవాణి అందించిన నాటు నాటు సాంగ్ కి చంద్రబోస్ లిరిక్స్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్  కొరియోగ్రఫీ ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేశాయి. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ (Oscar) ని కూడా అందుకొని చరిత్ర సృష్టించింది. ఇక ఈ పాటకి సాధారణ ప్రజలనుంచి సెలబ్రిటీల వరకు అదిరిపోయే స్టెప్పులేసి ఆనందించారు. కాగా, ప్రస్తుతం ఈ పాట మరోసారి వార్తల్లో నిలిచింది.

తాజాగా ఈ సాంగ్ ని యుక్రెయిన్ (Ukraine) సైనికులు నిరసన తెలపడానికి ఉపయోగించుకున్నారు. నాటు నాటు సాంగ్ లో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ బ్రిటిష్ అధికారికి వ్యతిరేకంగా వేసిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ సాంగ్ ని యుక్రెయిన్, రష్యా (Russia) అధికారులకు వ్యతిరేకంగా ఈ సాంగ్ ని రీ క్రియేట్ చేశారు. సాంగ్ మ్యూజిక్ ని తీసుకోని లిరిక్స్ మార్చి పేరడీ చేసి యుక్రెయిన్ మిలిటరీ అధికారులు డాన్స్ చేశారు. కాగా యుక్రెయిన్, రష్యా కొంతకాలంగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక సాంగ్ ని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతుంది. యుక్రెయిన్ మిలిటరీ సాంగ్ ని చాలా బాగా రీ క్రియేట్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.