Guntur Kaaram: కబడ్డీ.. కబడ్డీ.. కబడ్డీ..!
Hyderabad: సూపర్‌స్టార్ మహేష్ బాబు (mahesh babu) నటిస్తున్న గుంటూరు కారం (guntur kaaram) షూటింగ్ షెడ్యూల్ ఫాస్ట్ ఫాస్ట్‌గా జరిగిపోతోంది. మాస్ ఫ్యాన్స్ మహేష్ సినిమా నుంచి ఏం కోరుకుంటున్నారో అవన్నీ ఇందులో ఉండబోతున్నాయి. ఈ సినిమాలో ఒక అరగంట పాటు కబడ్డీ యాక్షన్ ఎపిసోడ్ ఉండబోతోందట. ఒక్కడు సినిమాలో కబడ్డీ కబడ్డీ అంటూ మహేష్ రఫ్ ఆడించిన సీన్ ఎప్పటికీ ఫ్యాన్స్ మర్చిపోలేరు. ఇప్పుడు కబడ్డీ ఆటతోనే ఓ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేసారు గురూజీ (trivikram). గుంటూరు కారం అని మూవీ టైటిల్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచే విపరీతమైన హైప్ క్రియేట్ చేసేసారు. ఇక ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే (pooja hegde) అనుకున్నారు కానీ ఆమె డ్రాప్ అయిపోయారు. ఇప్పుడు సెకండ్ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీలను (sreeleela) మెయిన్ హీరోయిన్ ప్లేస్‌లో పెట్టేసి షూటింగ్ కానిచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో పూజతో (pooja hegde) ఓ స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారని టాక్.