Trivikram: సమంత కోసం బన్నీ నాకు ఫోన్ చేసాడు
Trivikram: సూపర్‌స్టార్ రజినీకాంత్‌కి తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీలోనూ ఫ్యాన్స్ ఉన్నారని.. ఆ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సమంతే అని అన్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆలియా భట్, వేదాంగ్ రైనా నటించిన జిగ్రా సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటుచేసారు. ఈ వేడుకకు రానా దగ్గుబాటి, సమంత, త్రివిక్రమ్ శ్రీనివాస్ అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ సమంతను తెగ పొగిడేసారు.
రజినీకాంత్ తర్వాత సమంతే. ఆ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సమంత మాత్రమే. ఆమె హైదరాబాద్‌కి రావడం లేదని తనకోసం కథలు రాయడం కూడా మానేసా అని అన్నారు. అప్పుడు సమంత.. మీరు హీరోలకి మాత్రమే రాస్తున్నారు కదా అని సెటైర్ వేసారు. ఒకప్పుడు అల్లు అర్జున్ కూడా సమంతకు వీరాభిమానే అని ఓసారి బన్నీ తనకు ఫోన్ చేసి సమంత అనే కొత్త హీరోయిన్ వచ్చింది చూసారా అని అన్నాడని ఈ సందర్భంగా త్రివిక్రమ్ వెల్లడించారు.
ఇక నటి ఆలియా భట్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగు భాషతో మరింత అనుబంధం ఏర్పడిందని.. తన కూతురు రాహా ఇంట్లో నాటు నాటు పాటకు డ్యాన్స్ వేస్తూ ఉంటుందని అన్నారు. అవకాశం ఉంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంతతో కలిసి నటించాలని ఉందని తెలిపారు.