Trivikram: ప‌వ‌న్ నుంచి కాస్ట్లీ గిఫ్ట్…?

Trivikram: మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌కు ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ (pawan kalyan) నుంచి కాస్ట్లీ గిఫ్ట్ అందిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. జూబ్లీహిల్స్‌లో రూ.6 కోట్ల విలువైన బంగ్లాను ప‌వ‌న్ త్రివిక్ర‌మ్‌కు కానుకగా ఇచ్చార‌ట‌. న‌వంబ‌ర్ 7న త్రివిక్ర‌మ్ త‌న 52వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ త్రివిక్ర‌మ్‌కు బ‌ర్త్‌డే కానుక‌గా ఆ రూ.6 కోట్ల విలువైన ఇల్లు ఇచ్చిన‌ట్లు టాక్.

2008లో వ‌చ్చిన జ‌ల్సా సినిమాతో ప‌వ‌న్ త్రివిక్ర‌మ్‌లు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ త‌ర్వాత అత్తారింటికి దారేది, అజ్ఞాత‌వాసి సినిమాలు చేసారు. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ సినిమాల‌కు మంచి అడ్వైజ‌ర్‌గా మారారు. ప‌వ‌న్‌కు ఎలాంటి స్క్రిప్ట్స్ చెప్పాలో ముందు ద‌ర్శ‌కులు త్రివిక్ర‌మ్‌తో చ‌ర్చించిన త‌ర్వాతే ప‌వ‌న్ ద‌గ్గ‌రికి వెళ్తున్నారు. భీమ్లా నాయ‌క్, బ్రో సినిమాలు కూడా అలా వ‌చ్చిన‌వే.