Trivikram: ప‌వ‌న్ కోసం వ‌రుస సినిమాలు

trivikram new projects for pawan kalyan

Trivikram: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మ‌ధ్య ఉన్న బాండింగ్ అంద‌రికీ తెలిసిందే. ప‌వ‌న్‌కు స‌ల‌హాలు ఇచ్చే అతికొద్ది మందిలో త్రివిక్ర‌మ్ ముందుంటారు. ఇప్పుడు ప‌వ‌న్ రాజ‌కీయాల‌తో బిజీగా ఉండ‌టంతో త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ చేయాల్సిన సినిమాల సంగ‌తి చూసుకుంటున్నార‌ట‌.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేతిలో ఓజీ, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు సినిమాల షూటింగ్ పూర్తి చేసే ప‌నిలో ప‌వ‌న్ ఉన్నారు. ఈ సినిమాల త‌ర్వాత ప‌వ‌న్ మ‌రో రెండు సినిమాలు చేయ‌బోతున్నారు. ఆ రెండు సినిమాల‌ను త్రివిక్రమ్ ఫైన‌లైజ్ చేసారు.  కొత్త ద‌ర్శ‌కుల నుంచి స్క్రిప్ట్స్ వినే ప‌నిలో త్రివిక్ర‌మ్ ఉన్నారు. త్రివిక్ర‌మ్ ఫైన‌లైజ్ చేసిన సినిమాల్లో ఒక సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించ‌బోతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాక ప‌వ‌న్ సినిమాలు కొన‌సాగిస్తారా లేదా అనే క్లారిటీ వ‌స్తుంది.