OG: మ‌ళ్లీ వేలు పెట్టిన త్రివిక్ర‌మ్..😩

Hyderabad: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) సినిమాల్లో ఈ మ‌ధ్య‌కాలంలో ఎక్కువ‌గా క‌ల‌గ‌జేసుకుంటున్నారంటూ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌పై (trivikram) మండిప‌డుతున్నారు ఫ్యాన్స్. ఆయ‌న వేలు పెట్ట‌డంతో ప‌వ‌న్ సినిమాల్లో ఉండాల్సిన ఫీల్, గ్రేస్ పోతోంద‌ని అంటున్నారు. (og) మొన్న రిలీజ్ అయిన బ్రో (bro) సినిమాలో కూడా ఇదే జరిగింది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ రాసిన కొన్ని డైలాగులు, చేసిన మార్పులు అస్స‌లు బాలేవ‌ని ఫ్యాన్స్ హ‌ర్ట్ అయ్యారు. ఇక నుంచి త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ సినిమాల్లో క‌ల‌గ‌జేసుకోకుండా ఉంటేనే బెట‌ర్ అని అంటున్నారు.

కానీ త్రివిక్ర‌మ్ ఎవ్వ‌రినీ ప‌ట్టించుకోవ‌డంలేదు. సుజీత్ (sujeeth) డైరెక్ట్ చేస్తున్న ఓజీ (og) సినిమాలో కూడా వేలు పెట్టారు. దాదాపు ఆరేళ్ల త‌ర్వాత ఎలాంటి రీమేక్ కాకుండా స్ట్రెయిట్ సినిమా చేస్తున్నారు ప‌వ‌న్. అలాంట‌ప్పుడు ఈ సినిమాకు మ్యూజిక్ కింగ్ అనిరుధ్ రవిచంద‌ర్‌ను (anirudh ravichander) తీసుకుంటే సినిమా ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని సుజీత్ అనుకున్నారు. కానీ త్రివిక్ర‌మ్ క‌ల‌గ‌జేసుకుని అనిరుధ్ వ‌ద్దు త‌మ‌న్‌ను (thaman) పెట్టేద్దాం అని చెప్పాడ‌ట‌. దాంతో మ‌ళ్లీ ఫ్యాన్స్ త‌ల‌ప‌ట్టుకుని కూర్చున్నారు. త‌మ‌న్ మ్యూజిక్ బాగోదు అని కాదు కానీ ప‌వ‌న్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ప‌డితే సినిమా ఒక రేంజ్‌లో ఉంటుంది. అలా ఎందుకు త్రివిక్ర‌మ్ (trivikram) ఆలోచించడంలేదో ఏంటో..! (og)