Trivikram Allu Arjun: సిక్కోలు గడ్డపై.. 400 కోట్ల సినిమా
Trivikram Allu Arjun: జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్లో మరో క్రేజీ సినిమా రాబోతోంది. ఈ సినిమా బడ్జెటే రూ.400 నుంచి రూ.500 కోట్ల వరకు ఉండబోతోందట. సిక్కోలు (శ్రీకాకుళం) సంస్కృతి ఉట్టిపడేలా సోషియో ఫాంటసీ సినిమాగా దీనిని త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్నారట. హారిక హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాయి. కేవలం ఒక తెలుగు కథలా మాత్రమే కాకుండా అన్ని భాషల వారికి అర్థమయ్యేలా ప్యాన్ ఇండియన్ రేంజ్లో తీయబోతున్నట్లు బన్నీ వాస్ తెలిపారు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్ షాప్స్‌లో పాల్గొంటారట. కుదిరితే షూటింగ్‌లోని సింహభాగాన్ని శ్రీకాకుళంలోనే తీస్తారని తెలుస్తోంది.