Trisha Vijay క‌లిసి ట్రిప్‌కి వెళ్లారా?

Hyderabad: ద‌ళ‌ప‌తి విజ‌య్‌, త్రిషలు (trisha vijay) దాదాపు 19 ఏళ్ల త‌ర్వాత లియో (leo) సినిమాతో త‌మిళ ఆడియ‌న్స్‌ను అల‌రించ‌బోతున్నారు. అయితే వీరిద్ద‌రి గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఒక అస‌భ్య‌క‌ర‌మైన రూమ‌ర్ వైర‌ల్ అవుతోంది. వీరిద్ద‌రూ క‌లిసి నార్వేలోని ఓస్లోలో వెకేష‌న్‌కు వెళ్లిన‌ట్లున్నార‌ని ఓ మూవీ ట్రాక‌ర్ ట్వీట్ చేసారు. ఆయ‌న ట్వీట్ చేయ‌డంతో నిజ‌మే అంటూ త్రిష‌, విజ‌య్‌లు క‌లిసి ట్రిప్‌లో ఉన్న ఫొటోను ఓ నెటిజ‌న్ షేర్ చేసాడు.

అస‌లు మ్యాటర్ ఏంటంటే.. విజ‌య్‌కి ఎప్ప‌టినుంచో త‌న భార్య‌తో విభేదాలు ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లో వారు విడాకులు కూడా తీసుకోనున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. అందుకే విజ‌య్‌కి సంబంధించిన ఏ ఈవెంట్లు, ఫంక్ష‌న్ల‌కు ఆయ‌న భార్య రావ‌డంలేద‌ని టాక్‌. అయితే ఇప్పుడు ఈ మూవీ ట్రాక‌ర్ చేసిన ట్వీట్ వ‌ల్ల త్రిష‌, విజ‌య్ డేటింగ్‌లో ఉన్నారా అన్న చ‌ర్చ మొద‌లైంది. (trisha vijay)

మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ రూమ‌ర్ స్టార్ట్ చేసిన వ్య‌క్తికి విజ‌య్ ప‌ట్ల ప‌ర్స‌న‌ల్ కోపం ఉన్న‌ట్టుంది. అందుకే విజ‌య్‌ని పెట్టి నెల్స‌న్ తీసిన బీస్ట్ పోయింది.. కానీ నెల్స‌న్ ర‌జినీకాంత్‌తో తీసిన జైల‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది అంటూ ఇన్‌డైరెక్ట్ ఎటాక్స్ చేస్తున్నాడు. అదీకాకుండా విజ‌య్ గురించి రాసేట‌ప్పుడు ఎవ‌రైనా ద‌ళ‌ప‌తి విజ‌య్‌, లేదా విజ‌య్ అని రాస్తారు. కానీ ఈ సో కాల్డ్ మూవీ ట్రాకర్ మాత్రం విజ‌య్ మ‌తం గురించి అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో జోసెఫ్ విజ‌య్ అని రాస్తూ పోస్ట్‌లు పెడుతున్నాడు. ఈ విష‌యంలో విజ‌య్ నుంచి డైరెక్ట్ వార్నింగ్ వ‌స్తే కానీ ఇత‌ను సెట్ అయ్యేలా లేడు. (trisha vijay)

trisha and vijay leo
trisha and vijay leo