Trisha: నీలాంటి వ్య‌క్తితో చ‌చ్చినా న‌టించ‌ను

Trisha: న‌టి త్రిష‌.. ప్ర‌ముఖ ఆర్టిస్ట్ మ‌న్సూర్ అలీ ఖాన్‌పై (mansoor ali khan) మండిప‌డ్డారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మ‌న్సూర్ మాట్లాడుతూ.. త‌నలో ఓ మంచి విల‌న్ ఉన్నాడ‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో విల‌న్ పాత్ర‌లు పోషించాన‌ని త్రిష లాంటి నటితో కూడా విల‌న్ పాత్ర‌లో న‌టించాల‌ని ఉంద‌ని అస‌భ్య‌క‌రంగా వ్యాఖ్యానించాడు. ఈ వీడియో త్రిష దృష్టికి రావ‌డంతో ఆమె మండిప‌డ్డారు. దేవుడి ద‌య వ‌ల్ల‌ మ‌న్సూర్ లాంటి వ్య‌క్తితో ఇప్ప‌టివ‌ర‌కు తాను న‌టించ‌లేద‌ని..త‌న‌ను క‌ల‌లు కంటే క‌న్నాడు కానీ ఇక ముందు సినిమాల్లో కూడా అత‌నితో క‌లిసి న‌టించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని తెలిపారు. ఇలాంటి నీచ‌మైన మెంటాలిటీ ఉన్న వారు మ‌గ‌జాతికే మ‌చ్చ తెస్తార‌ని మండిప‌డ్డారు.

గ‌తంలో కూడా న‌టి త‌మ‌న్నాపై (tamanna) ఇలాంటి కామెంట్స్ చేసి వైర‌ల్ అయ్యారు మ‌న్సూర్. త‌న సినిమాలో ఎలాంటి అస‌భ్య‌క‌ర స‌న్నివేశాలు లేక‌పోయినా సెన్సార్ బోర్డు చాలా క‌ట్స్ ఇచ్చింద‌ని కానీ జైల‌ర్ (jailer) సినిమాలోని కావాల‌య్యా (kavalayya) పాట‌లో త‌మ‌న్నా అన్నీ విప్పి చూపిస్తే మాత్రం సెన్సార్ బోర్డు దానిని ఓకే చేసిందని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు.