Trisha: మలయాళ నిర్మాతతో పెళ్లి?
ఎవర్‌గ్రీన్ బ్యూటీ త్రిష (trisha) పెళ్లి వార్తలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఆమె ఓ మలయాళ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇవి మరింత వైరల్ అయ్యి తన కెరీర్‌పై ప్రభావం చూపకముందే త్రిష రియాక్ట్ అయ్యారు. ఇలాంటి రూమర్లు సృష్టించకండి అని ట్వీట్ చేసారు. కొన్నేళ్ల క్రితం త్రిష.. వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తను ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. అయితే పెళ్లి తర్వాత కూడా త్రిష సినిమాలు చేస్తానని చెప్పడంతో వరుణ్ కుటుంబీకులు ఒప్పుకోలేదు. దాంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. కొంతకాలం పాటు ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి, త్రిష కూడా డేట్ చేసారు. కొన్ని కారణాల వల్ల వీరి ప్రేమ పెళ్లి పీటలు ఎక్కలేకపోయింది. ఈ విషయంపై రానా ఓసారి స్పందిస్తూ.. త్రిషతో వర్కవుట్ అవ్వలేదు.. అనుకున్నవన్నీ జరగాలని లేదు కదా అని అన్నారు. (trisha)