Trisha: తప్పుడు వ్యాఖ్యలు చేసిన మన్సూర్‌ని క్షమించేసిన నటి
తనపై తప్పుడు కూతలు కూసిన నటుడు మన్సూర్ అలీ ఖాన్‌ను (mansoor ali khan) క్షమించేసారు త్రిష (trisha). తప్పు చేయడం మానవ సహజం.. క్షమించడం దైవ గుణం అని క్యాప్షన్ ఇస్తూ ఈ వివాదానికి ముగింపు పలికారు.
కొన్ని రోజుల క్రితం మన్సూర్ అలీ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఎన్నో విలన్ పాత్రలు పోషించి ఎందరో హీరోయిన్లతో రేప్ సీన్లు చేసానని కానీ త్రిషతో అలాంటి సీన్‌లో నటించే అవకాశం రానందుకు బాధపడుతున్నానని అన్నారు. దాంతో త్రిష మండిపడ్డారు. త్రిషకు మద్దతుగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ నిలిచింది.
ఇంత రచ్చ అవుతుంటే తాను త్రిషకు క్షమాపణలు చెప్పనని.. త్రిష తనతో నటించను అన్నందుకు ఆమెపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో మన్సూర్‌పై చెన్నై డీసీపీ కేసు వేసారు. ఈ కేసులో మన్సూర్ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ మద్రాస్ హైకోర్టు రిజెక్ట్ చేసింది. దాంతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్న మన్సూర్ ఎట్టకేలకు త్రిషకు ట్విటర్ ద్వారా క్షమాపణలు చెప్పారు. త్రిష పెళ్లికి హాజరయ్యి ఆమెను ఆశీర్వదించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. దాంతో త్రిష కూడా క్షమించేసాను అన్నట్లు ఈ వివాదానికి తెరదించారు.