Trisha: యానిమ‌ల్ సినిమా బాగుంద‌ని చెప్పి ఎందుకు డిలీట్ చేసిన‌ట్లు?

Trisha: న‌టి త్రిష యానిమ‌ల్ (animal) సినిమా ఎంతో బాగుందంటూ ఓ పోస్ట్ పెట్టారు. కానీ కొంత‌సేప‌టికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసేసారు. సినిమా ఒక క‌ల్ట్ హిట్ అని పోస్ట్ చేసిన త్రిష కాసేప‌టి ఆ పోస్ట్‌ని డిలీట్ చేసింది. ఇందుకు కార‌ణం విష‌పూరిత‌మైన మ‌గ‌వాడి ప్ర‌వ‌ర్త‌ను త్రిష పొగ‌డ‌ట‌మే. యానిమ‌ల్ సినిమాలో ర‌ణ్‌బీర్ (ranbir kapoor) ఎంత బాగా న‌టించినప్ప‌టికీ అత‌ని ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గా లేదు. దాంతో త్రిష‌పై నెటిజన్లు మండిప‌డుతున్నారు. మ‌న్సూర్ అలీ ఖాన్ (mansoor ali khan) త‌న‌ను ఏదో అన్నార‌ని తెగ ఏడ్చేసిన త్రిష ఈరోజు యానిమ‌ల్ సినిమాలో ర‌ణ్‌బీర్ టాగ్జిక్ ప్ర‌వ‌ర్త‌న న‌చ్చింది అని ఎలా చెప్తోంది అని ప్ర‌శ్నిస్తున్నారు. దాంతో ఎందుకొచ్చిన గొడ‌వ‌లే అని త్రిష ఆ పోస్ట్ డిలీట్ చేసేసారు.