Salaar: ట్రాన్స్‌జెండ‌ర్ల ఫైట్..!

Hyderabad: యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) న‌టిస్తున్న స‌లార్ (salaar) సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌శాంత్ నీల్ (prashanth neel) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఓ సర్‌ప్రైజింగ్ ఫైట్ ఉండ‌బోతోంద‌ట‌. విల‌న్ సైడ్ పనిచేసే ట్రాన్స్‌జెండ‌ర్ల‌ను పెట్టి ప్ర‌భాస్‌తో ఓ ఫైట్ సీన్ ప్లాన్ చేసారు ప్ర‌శాంత్ నీల్. పేద ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే వీరుడిలా ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ ఉండ‌బోతోంద‌ట‌. ప్ర‌భాస్ కొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నారు. ఒరిస్సా బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాను ప్లాన్ చేసారు.

ఇక ఈ సినిమాకు (salaar) సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్‌ని జులైలోనే రిలీజ్ చేస్తార‌ని టాక్. ఆగ‌స్ట్‌లో ట్రైల‌ర్ సర్‌ప్రైజ్ ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే ట్రైల‌ర్‌లో లిమిటెడ్ గ్లింప్స్ మాత్ర‌మే చూపించ‌బోతున్నార‌ట‌. ఇక సెప్టెంబ‌ర్‌లో సెకండ్ గ్లింప్స్ ఉండ‌బోతోంద‌ని టాక్. ఇందులో శృతి హాస‌న్ (shruti haasan) హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది.