Tovino Thomas: నేను తెలుగు సినిమా చేస్తే నా కెరీర్ ఆగిపోతుంది

Tovino Thomas says malayalam films get affected if he does a telugu film

Tovino Thomas: తాను ఒక్క తెలుగు సినిమా చేస్తే త‌న మ‌ల‌యాళ సినీ కెరీర్ ఆగిపోతుంద‌ని అన్నారు ప్రముఖ మ‌ల‌యాళ న‌టుడు టోవినో థామ‌స్. టోవినో థామ‌స్, కృతి శెట్టి న‌టించిన అజ‌యంతే రండం మోష‌న‌మ్ అనే సినిమా శుక్ర‌వారం రిలీజ్ కానుంది. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తెలుగు మీడియాతో మాట్లాడారు.

తెలుగు సినిమాల్లో న‌టించ‌చ్చు క‌దా అని అడిగిన ప్ర‌శ్న‌కు టోవినో స్పందించారు. “” నేను తెలుగు సినిమాల్లో న‌టించ‌లేను. నేను ఒక్క తెలుగు సినిమా చేస్తే నావి నాలుగైదు మ‌ల‌యాళ సినిమాలు ఆగిపోతాయి. అదే నేను ఒక తెలుగు మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తే ఇక నా మ‌ల‌యాళ సినీ కెరీర్ ఆగిపోతుంది. కాబ‌ట్టి నాకు తెలుగులో న‌టించాల‌న్న ఉద్దేశం లేదు “” అని వెల్ల‌డించారు.