Tom Cruise: ఆయనకు 61.. ఆమెకు 36.. జోడి అదిరిపోలా..!
Tom Cruise: హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ గురించి తెలియని ఆడియన్స్ ఎవరు ఉండరు. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. హాలీవుడ్ లెజెండ్ హారిసన్ ఫోర్డ్… ఆయనే తనకు ఇన్‌స్పిరేషన్ అన్న టామ్, తను కూడా 80 ఏళ్లు వచ్చే వరకు మిషన్ ఇంపాజిబుల్ (Mission Impossible) సిరీస్‌లో నటిస్తూనే ఉంటానని తెలిపారు.
అయితే తాజాగా ఈ హీరోకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. 61ఏళ్ళ వయసు గల టామ్ క్రూజ్ 36ఏళ్ళ అమ్మాయితో ప్రేమలో పడ్డారట. ప్రస్తుతం ఈ వార్త హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రేమ విషయం గత ఏడాది డిసెంబర్ లో బయటికి వచ్చింది.
రష్యాకి చెందిన ప్రముఖ మోడల్ ‘ఎల్సినా ఖైరోవా’తో (Elsina Khayrova) టామ్ క్రూజ్ ప్రేమలో పడ్డారట. ఎల్సినా ఖైరోవా రష్యాలో జన్మించిన మాజీ మోడల్. ఇప్పుడు లండన్‌లో బ్రిటిష్ పౌరురాలు. ఆమె వ్లాదిమిర్ పుతిన్ మిత్రుడు, ప్రముఖ రష్యన్ రాజకీయ నాయకుడు రినాట్ ఖైరోవ్ కుమార్తె. శ్రీమతి ఖైరోవా గతంలో రష్యన్ డైమండ్ టైకూన్ డిమిత్రి త్వెట్కోవ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే వారు 2020లో విడిపోయారు. తరువాత 2023 డిసెంబర్ లో లండన్‌లోని మేఫెయిర్‌లో టామ్ క్రూజ్ తో కలిసి పార్టీలో పాల్గొన్నారు.
అప్పటి నుంచే వీరిద్దరి ప్రేమ రూమర్స్ మొదలయ్యాయి. అంతే కాదు ఈ జంట ఇటీవల లండన్ లోని ఎయిర్ అంబులెన్స్ ఛారిటీకి మద్దతు ఇచ్చే ఛారిటీ డిన్నర్‌లో కూడా కలిసి కనిపించారు. అలాగే లండన్‌లోని కొన్ని ప్రత్యేకమైన రెస్టారెంట్‌లలో డిన్నర్స్ చేస్తూ, ఎల్సినా ఇంటికి సమీపంలోని హైడ్ పార్క్‌లో జంటగా చక్కర్లు కొడుతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇక తమ ప్రైవసీ దెబ్బతినకుండా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు బయటకి రాకుండా టామ్ క్రూజ్ జాగ్రత్త పడుతున్నారట. కాగా హాలీవుడ్ మీడియాలో తాజాగా వినిపిస్తున్న వార్తలు ఏంటంటే.. టామ్ క్రూజ్, ఎల్సినాతో కలిసి తన అపార్ట్మెంట్ లోనే ఉంటున్నారని వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరి వీటిలో ఎంత నిజముందో తెలియదు. కాగా టామ్ క్రూజ్ కి ఇప్పటికే మూడుసార్లు పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్నారు.
1987 లో మిమీ రోజర్స్ ని వివాహం చేసుకున్న టామ్ క్రూజ్.. 1990 విడాకులు ఇచ్చారు. ఆ తరువాత నికోల్ కిడ్‌మాన్ తో కలిసి నడిచి.. 2001లో విడిపోయారు. 2006లో కేటీ హోమ్స్ తో రిలేషన్ మొదలుపెట్టిన టామ్ క్రూజ్.. 2012 ఆమెతో విడిపోయారు. ఇప్పుడు ఎల్సినా ఖైరోవాతో రిలేషన్ మొదలుపెట్టారు.
టామ్ క్రూస్ ప్రపంచంలోనే అత్యధిక అభిమానులు కలిగిన యాక్షన్ హీరో, ఏ నటుడూ కలలో కూడా ఊహించనంత పారితోషికం తీసుకుని అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసిన సూపర్ స్టార్. 1997 నుంచి 2000 వరకు వరుసగా మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, రెండు సార్లు ఎంటీవీ బెస్ట్ మేల్ యాక్టర్ అవార్డులు అందుకుని ప్రతి సినిమాతో అంచెలంచలుగా ఎదుగుతూ వచ్చాడు. టామ్ ఇటీవలే విడుదలైన టాప్ గన్ మావేరిక్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఈ ఏడాదిలో విడుదలైన తన సినిమాలకు రెమ్యునిరేషన్ గా వంద మిలియన్ల యూఎస్ డాలర్లు అందుకుని ప్రపంచంలోనే అధిక పారితోషికం తీసుకున్న నటుడిగా చరిత్ర సృష్టించాడు.