Movie Promotions అవసరం లేదా?
ప్రమోషన్స్ లేకుండా ఏ ప్రొడక్ట్.. ఏ సినిమా.. ఏ కంపెనీ లాభపడినట్లు చరిత్రలోనే లేదు (movie promotions). ప్రమోషన్స్ డైరెక్ట్‌గా అయినా చేయాలి లేదా ఇన్‌డైరెక్ట్‌గా అయినా ఉండాలి. ప్రమోషన్స్ బాగా చేస్తే సినిమాలు కేవలం హిట్ అవుతాయి అనుకోవడం పొరపాటు. కొన్నిసార్లు ఫ్లాప్ కూడా అవ్వచ్చు. అలా ఫ్లాపైన సినిమాల లిస్ట్ చాలానే ఉంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ఏంటంటే… సినిమాలకు ప్రమోషన్స్ చేయొద్దు అనుకుంటున్నారట. సినిమా అనౌన్స్‌మెంట్, షూటింగ్ అప్డేట్స్, రిలీజ్ డేట్ చెప్పేస్తే చాలు అనుకుంటున్నారట. సినిమా హిట్ అవ్వడానికి ప్రమోషన్స్ అవసరం లేదని..ఏ ప్రమోషన్స్ జరిగాయని జైలర్ అంత పెద్ద హిట్ అయిందని అనుకుంటున్నారట. (movie promotions)
ఇలా ఎవరు అనుకున్నారో తెలీదు కానీ.. జైలర్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అది సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా. ప్లస్ అనిరుధ్ రవిచందర్ ఆడియో లాంచ్ టైంలో చేసిన హంగామానే కారణం. అందుకే ఆ సినిమా అంత విజయం సాధించింది. అవన్నీ వదిలేసి.. నేను ప్రమోషన్స్ చేయను… అవసరం ఏముంది అనుకుంటే పోస్టర్ ఖర్చులు కూడా రాకుండాపోతాయి. మన వరకు మనం సినిమాను ప్రమోట్ చేసుకోవాలి. అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది దేవుడికి, ఆడియన్స్‌కి ఎరుక. (movie promotions)