Tollywood హీరోలపై ఆ రూమర్స్ నిజమేనా?
టాలీవుడ్ (tollywood) టాప్ హీరోలపై ఒక రూమర్ నడుస్తోంది. ఆ రూమర్ వారి రెమ్యునరేషన్లకు సంబంధించినది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పుడున్న టాప్ హీరోలంతా గత ఆరు, ఏడు ఏళ్ల వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూనే వచ్చాయి. హిట్ పడినప్పుడు రెమ్యునరేషన్‌ను ఆటోమేటిక్‌గా పెంచేస్తారు. కానీ ఫ్లాప్ వచ్చినా కూడా అంతే రెమ్యునరేషన్ (remuneration) డిమాండ్ చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారట. కలెక్షన్స్ బాగా రాలేదని.. సినిమా ఫ్లాప్ అయిందని తెలిసినా కూడా గ్రాస్ కలెక్షన్లు చూపించుకుని భారీగా డబ్బులు తీసుకుంటున్నారట. దాంతో పెద్ద హీరోలతో సినిమాలు చేయాలంటే నిర్మాతలకు వణుకు పుడుతోంది. (tollywood)
గ్రాస్ కలెక్షన్స్ అంటే.. ఇప్పుడు 200 కోట్లు కలెక్షన్లు వస్తే.. అందులో 90 నుంచి 95 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్ పాకెట్లోకి వెళ్తాయి. అయినప్పటికీ 200 కోట్లు.. 300 కోట్లు వసూళ్లు రాబట్టిందంటూ నిర్మాతలు కూడా పోస్టర్లు వేసి ఆడియన్స్‌ని ఊరిస్తుంటారు. ఇలా చేస్తే అప్పటివరకు సినిమా చూడని వారు కలెక్షన్లు చూసి వస్తారన్న ఆశ. అయితే అన్నీ తెలిసిన హీరోలు కూడా నిర్మాతల దగ్గర ఇదే గ్రాస్ కలెక్షన్లు చూపించి భారీగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారట.
దీనిపై నిర్మాత లగడపాటి శ్రీధర్ స్పందిస్తూ.. చాలా మంది హీరోలకు కూడా ప్రొడక్షన్ హౌస్‌లు ఉన్నాయని.. గ్రాస్, నెట్ కలెక్షన్లకు తేడా వారికి కూడా తెలుసని అంటున్నారు. హీరోలపై పడి ఏడ్చే బదులు ఒక హీరోతో సినిమా చేయబోయు ముందు ఎంత డబ్బు అవుతుందో నిర్మాత ముందే లెక్కలేసుకుంటే బెటర్ అని సలహా ఇచ్చారు. ఒక ప్రొడ్యూసర్ ఎప్పుడూ కూడా వ్యాపారవేత్తలాగా థింక్ చేయాలని అన్నారు. ఇక టాప్ హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ల గురించి మాట్లాడుతూ.. వారికున్న బ్రాండ్, మార్కెట్ వ్యాల్యూని మైండ్‌లో పెట్టుకునే రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారని అందులో ఏ తప్పూ లేదని తెలిపారు. రెమ్యునరేషన్లు ఇవ్వలేనప్పుడు అవే కథలను చిన్న హీరోలతో తీసే ఆప్షన్ కూడా ఉందని, అది వదిలేసి పెద్ద హీరోలు డబ్బులు దొబ్బేస్తున్నారు అని నిందలు వేయడం సరికాదని మండిపడ్డారు. (tollywood)