National Film Awards: టాలీవుడ్ డామినేషన్‌కి రియాక్ట్ అయిన జ్యూరీ మెంబర్
ఈరోజు 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను (national film awards) అనౌన్స్ చేసారు. చాలా కేటగిరీల్లో మన తెలుగు సినిమా ఇతర సినీ పరిశ్రమలను డామినేట్ చేసేసింది. ప్రముఖ డైరెక్టర్, నేషనల్ ఫిలిం అవార్డ్ జ్యూరీ మెంబర్ కేతన్ మెహతా (ketan mehta) అన్ని అవార్డులు టాలీవుడ్‌కే వస్తుంటే ఆయన కూడా రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోయారు. నాలుగు కేటగిరీల్లో RRR అవార్డులను గెలుచుకుంది. దాంతో కేతన్ మెహతా RRR…RRR..అని అనౌన్స్ చేస్తున్నప్పుడు మధ్యలో ఆగి మిగతా పేర్లు కూడా వస్తాయ్ అని అనడం హైలైట్‌గా నిలిచింది. అన్నీ తెలుగు సినిమాలే కాదు ఇతర భాషల సినిమాలు కూడా లిస్ట్‌లో ఉన్నాయి అని చెప్పడం ఆయన ఉద్దేశం. (national film awards)