Tipu Sultan: పాన్ ఇండియా లెవల్లో బయోపిక్!
Hyderabad: ప్రముఖ నిర్మాణ సంస్థ EROS ఇంటర్నేషనల్(Eros International) ఆధ్వర్యంలో రూపొందుతున్న సినిమా టిప్పు సుల్తాన్(Tipu Sultan). ఈ సినిమాకు సందీప్ సింగ్(Sandeep Singh), రష్మీ శర్మ(Rashmi Sharma) నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా పవన్ శర్మ(Pawan Sharma) దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అకృత్యాలు, అరాచకాలతో చరిత్ర పుటల్లో నిలిచిన టిప్పు సుల్తాన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ రచయిత రాజత్ సేథీ టిప్పు సుల్తాన్ గురించి రీసెర్చ్ చేసి మరీ ఈ కథని సిద్ధం చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ తో పాటు టిప్పు సుల్తాన్ విధ్వంసాల గురించి వివరిస్తూ ఓ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్.
ఈ వీడియోలో.. టిప్పు సుల్తాన్ చేసిన అరాచకాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. దాదాపు 8000 ఆలయాలను, 27 చర్చిలను కూల్చివేసినట్టు, 2000 బ్రాహ్మణ కుటుంబాలను నాశనం చేసినట్టు, 40 లక్షల మంది హిందువులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చినట్టు, వారితో బలవంతంగా బీఫ్ తినిపించినట్టు, లక్షకు మందికి పైగా హిందువులను జైల్లో వేసినట్టు, 1783 లోనే టిప్పు సుల్తాన్ ఊచకోత మొదలుపెట్టినట్టు తెలిపారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక పోస్టర్ రిలీజ్ చేయగా ఈ పోస్టర్ లో టిప్పు సుల్తాన్ ఫేస్ మీద బ్లాక్ పెయింట్ వేసినట్టు చూపించారు. అయితే కొంతమంది నుంచి ఈ సినిమాపై వ్యతిరేకత ఎదురవుతోంది. ‘టిప్పు’ టైటిల్ తో ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయనున్నారు.