Tillotama Shome: లిఫ్ట్ ఇస్తాన‌ని చెప్పి.. నాతో ప్యాంట్ జిప్ విప్పించుకున్నాడు

Tillotama Shome reveals horrifying experience in delhi

Tillotama Shome: ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి తిలోత్త‌మా షోమేకి ఢిల్లీ షాకింగ్ సంఘ‌ట‌న ఎదురైంద‌ట‌. తాను సినిమాల్లోకి రాక‌ముందు ఓ రోజు ఢిల్లీ రోడ్డుపై బ‌స్సు కోసం ఎదురుచూస్తుండ‌గా.. కొంద‌రు యువ‌కులు కారులో వ‌చ్చి త‌న‌ను ఏడిపించార‌ని తెలిపారు. త‌న‌పై చిన్న చిన్న రాళ్లు వేయ‌డం.. వింత పేర్ల‌తో పిల‌వ‌డం వంటివి చేస్తుంటే భ‌యంతో న‌డిరోడ్డు మ‌ధ్య‌లో లిఫ్ట్ కోసం నిల‌బడ్డాన‌ని చాలా మంది ఆప‌కుండా వెళ్లిపోయార‌ని తెలిపారు.

ఆ త‌ర్వాత ఓ వ్య‌క్తి త‌న కారు ఆపి లిఫ్ట్ ఇచ్చాడ‌ని.. అత‌ని కారుపై ఉన్న ప్ల‌స్ సింబ‌ల్ చూస్తే అత‌ను ఓ డాక్ట‌ర్ అని తెలిసింది అన్నారు. కారు కొద్ది దూరం వెళ్లాక అత‌ను త‌న చెయ్యి లాక్కుని త‌న ప్యాంట్ జిప్ విప్పుకున్నాడ‌ని.. ఆ త‌ర్వాత త‌న‌కు ఏం జ‌ర‌గ‌బోతోందో తెలిసి వెంట‌నే అత‌న్ని గాయ‌ప‌రిచాన‌ని దాంతో కారు నుంచి దింపేసి వెళ్లిపోయాడ‌ని వెల్ల‌డించారు. నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తున్న కోటా ఫ్యాక్ట‌రీ 3 అనే వెబ్‌సిరీస్‌లో తిలోత్త‌మ కీల‌క పాత్ర‌లో న‌టించారు.