Tiger Nageswara Rao: ముహూర్తం ఫిక్స్​.. వేటకు సిద్ధమా?

Hyderabad: గతేడాది ధమాకా(Dhamaka)తో సాలిడ్​ హిట్​ అందుకుని అదిరిపోయే కమ్​బ్యాక్​ ఇచ్చారు మాస్​ మహారాజ రవితేజ(Raviteja). ఈ ఏడాది ఆరంభంలోనూ మెగాస్టార్​ చిరంజీవి(Chiranjeevi) వాల్తేరు వీరయ్య సినిమాలోనూ ఓ కీలకపాత్రలో కనిపించి ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్​ ఇచ్చారు. కానీ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన రావణాసుర(Ravanasura)తో డిజాస్టర్​ అందుకున్నారు. ఈ ఫ్లాప్ నుంచి బయటకి వచ్చి ‘టైగర్ నాగేశ్వరరావు’(Tiger Nageswara Rao) బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నారు రవితేజ. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటినుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్​. అయితే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ కనీసం ఫస్ట్ లుక్ కూడా బయటకి రాలేదు. చాలా రోజులుగా టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యండి అంటూ మేకర్స్ ని ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ ఉన్నారు రవితేజ అభిమానులు.
కాగా తాజాగా టైగర్ నాగేశ్వరరావు డైరెక్టర్ వంశీ(Vamsee) సోషల్ మీడియాలో రవితేజ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. ‘ప్రియమైన తమ్ముళ్లు అందరికి ఓపిక గా వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు మీ మెసేజెస్, ట్వీట్స్ అన్ని చూస్తున్నాను. మీరిస్తున్న ఎంకరేజ్మెంట్, ప్రేమే నాతో ఇంకా హార్డ్ వర్క్ చేపిస్తోంది. టైగర్.. నా నాలుగేళ్ల ఆకలి…మీకు ఫస్ట్ లుక్ లో చూపిస్తాను. ఈ సారి వేట మామూలుగా ఉండదు. ఫస్ట్ లుక్ వచ్చాక నా ఆకలి తో పాటు మీ అందరి ఆకలి కూడా తీరిపోతుందని అనుకుంటున్నాను . ముహూర్తం ఫిక్స్ అయ్యింది తమ్ముళ్లు. వేటకి సిద్ధమా?’ అంటూ వంశీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో రవితేజ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఫస్ట్​ లుక్​ రిలీజ్​, సినిమా రిలీజ్​ డేట్​ అనౌన్స్​ చేయడమే మిగిలింది, వేట మొదలెట్టడమే!