Allu Arjun Atlee Film: బన్నీ అట్లీ సినిమా ఆగిపోవ‌డానికి కార‌ణం అదే

this is the reason why Allu Arjun Atlee Film shelved

Allu Arjun Atlee Film: అస‌లు ఫ్లాప్సే లేని.. హీరోల‌కు మాంచి హిట్స్ ఇచ్చే డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు ప్ర‌ముఖ తమిళ ద‌ర్శ‌కుడు అట్లీ. షారుక్ ఖాన్‌తో జ‌వాన్ సినిమా తీయ‌డంతో అట్లీ పేరు జాతీయ మీడియాల్లోనూ మారుమోగిపోతోంది. జ‌వాన్ తర్వాత అట్లీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ సినిమా తీయాల‌నుకున్నారు. ఇందుకు అల్లు అర్జున్ కూడా ఒప్పుకోవ‌డంతో అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా చేసేసారు.

ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వ‌స్తాయా అని బ‌న్నీ ఫ్యాన్స్ వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూసారు. కానీ వారి ఆశ‌లు అడియాస‌ల‌య్యాయి. అట్లీ బ‌న్నీ సినిమా ఆగిపోయింది. ఇందుకు కార‌ణం అట్లీనే అట‌. ఏకంగా రూ.80 కోట్లు పారితోషికం కావాల‌ని అట్లీ డిమాండ్ చేయ‌డంతో మా వ‌ల్ల కాదు అని నిర్మాత చేతులెత్తేసాడ‌ట‌. అడిగినంత పారితోషికం ఇస్తేనే చేస్తాన‌ని.. త‌న మార్క్ చూసి ఫీజ్ పెంచ‌న‌ప్పుడు ఎందుకు సినిమా చేయాల‌ని అట్లీ సినిమాను నిలిపివేసిన‌ట్లు తెలుస్తోంది.