Bollywood: 4 గంటల సినిమా.. నాగ్‌తో పాటు 33 మంది హీరోలు.. అట్టర్ ఫ్లాప్
Bollywood: బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌బీర్ కపూర్ (ranbir kapoor) నటించిన యానిమల్ (animal) సినిమా నిడివి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అంత నిడివి ఉన్నప్పటికీ తొలిరోజే దాదాపు రూ.60 కోట్లు వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సాధారణంగా ఒక సినిమా నిడివి రెండున్నర గంటలు మాత్రమే ఉండాలి. అంతేకంటే తక్కువ ఉన్నా ఫర్వాలేదు కానీ ఎక్కువ ఉంటే మాత్రం ప్రేక్షకులకు చూసే ఓపిక కూడా ఉండదు. ఆ సినిమా ఎంతో అద్భుతంగా ఉంటే తప్ప ప్రేక్షకులు అంత సేపు థియేటర్‌లో కూర్చోరు.
అయితే.. ఒకప్పుడు ఇదే బాలీవుడ్ ఓ సినిమాను తీసింది. ఈ సినిమా నిడివి ఏకంగా 4 గంటలు. ఇందులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 33 మంది హీరోలు ఉన్నారు. ఇంతా చేసి చివరికి సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడమే కాదు దాదాపు 12 మంది హీరోలకు కెరీర్ లేకుండా చేసింది. ఇంతకీ అదేం సినిమా అంటే.. జేపీ దత్తా తెరకెక్కించిన వార్ డ్రామా ఎల్ఓసీ కార్గిల్. ఈ సినిమా 2003లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో మన అక్కినేని నాగార్జునతో పాటు అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, అజయ్ దేవగణ్, అక్షయ్ ఖన్నా, మనోజ్ బాజ్‌పాయ్, అభిషేక్ బచ్చన్, అశుతోష్ రానా, రాజ్ బబ్బర్, సుదేశ్ బెర్రీ, మోహ్నీష్ బెహల్, అవతార్ గిల్ హీరోలుగా నటించారు.
సినిమా రిలీజ్ అయ్యాక చాలా మంది ఇదేం దిక్కుమాలిన సినిమా అని చీదరించుకున్నారట. దాదాపు రూ.33 కోట్లతో తీస్తే ఇండియాలో రూ.20 కోట్ల కంటే తక్కువ వసూలు చేసింది. ఇందులో నటించిన హీరోల్లో కొద్ది మందే పెద్ద హీరోలుగా ఎదిగారు కానీ దాదాపు 12 మందికి కెరీరే లేకుండాపోయింది.