Amazon Prime: ఈ సినిమాలు ప్రైం నుంచి డిలీట్ అయిపోతాయ్
Amazon Prime: అమెజాన్ ప్రైం నుంచి దాదాపు 8 సినిమాలను డిలీట్ చేయనుంది అమెజాన్ సంస్థ. కొందరు సినీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోలు చేసిన సినిమాలను కాంట్రాక్ట్‌ను బట్టి ప్రైంలో అందుబాటులో ఉంచుతారు. ఆ కాంట్రాక్ట్ ముగిసాక సినిమాలను తొలగించేస్తారు. అలా త్వరలో డిలీట్ కానున్న 8 సినిమాలు ఏవో చూద్దాం.
ఫైట్ క్లబ్ (fight club)
బ్రాడ్ పిట్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఫైట్ క్లబ్ డిలీట్ కానుంది. నిద్రలేమితో బాధపడే ఓ వ్యక్తి మరో వ్యక్తితో కలిసి ఎలా ఫైట్ క్లబ్‌ను నడుపుతాడు అనే అంశం చుట్టూ ఈ కథను రూపొందించారు దర్శకుడు డేవిడ్ ఫించర్.
ది గర్ల్ నెక్ట్స్ డోర్ (the girl next door)
ఈ సినిమా కూడా త్వరలో డిలీట్ అయిపోతుంది. ఓ సీనియర్ హై స్కూల్ అమ్మాయి తన పక్కింట్లో ఉండే అమ్మాయితో ఎలా ప్రేమలో పడింది.. ఆ తర్వాత ఏం జరిగింది అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. (amazon prime)
టాప్ గన్ : మేవరిక్ (top gun : maverick)
1986లో వచ్చిన టాప్ గన్‌కు ఈ సినిమా సీక్వెల్‌గా వచ్చింది. టామ్ క్రూజ్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
గాన్ గర్ల్ (gone girl)
గాన్ గర్ల్ అనే నవల ఆధారంగా తీసిన ఈ సినిమాలో ఓ మహిళ ఉన్నట్టుండి మాయమైపోతుంది. ఆ తర్వాత మీడియా ఆమె భర్తను కారణంగా చూపుతూ ఎలా హింసించారు అనే అంశం చుట్టూ ఈ కథ ఉంటుంది.
జుమాంజీ : వెల్కం టు ది జంగిల్ (jumanji: welcome to the jungle)
1995లో వచ్చిన జుమాంజీ సినిమాకు ఇది సీక్వెల్‌గా వచ్చింది. డ్వెయిన్ జాన్సన్, కెవిన్ హార్ట్, ప్రియాంక చోప్రా భర్త నిక్ జొనాస్ నటించిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది.
మెన్ ఇన్ బ్లాక్ : ఇంటర్నేషనల్ (men in black : international)
201లో వచ్చిన సైఫై సినిమా ఇది. ఇందులో ఉన్నవారంతా కలిసి ప్రపంచాన్ని ఎలా కాపాడతారు అనే కాన్సెప్ట్‌తో చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. (amazon prime)
వాట్ హ్యాపెన్స్ ఇన్ వెగాస్ (what happens in vegas)
2008లో వచ్చిన సినిమా ఇది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి లాస్ వెగాస్‌లో పార్టీ చేసుకున్నాక ఉదయం లేచి చూడగానే ఇద్దరూ పెళ్లి చేసుకుని ఉంటారు. అసలు ఇదెలా సాధ్యం అయ్యింది అనేదే కథ.
వెనమ్ (venom)
మార్వెల్ కామిక్స్ క్యారెక్టర్ అయిన వెనమ్ సినిమా కూడా త్వరలో ప్రైం నుంచి డిలీట్ అవ్వనుంది. (amazon prime)
పైన చెప్పిన సినిమాలన్నీ త్వరలో ప్రైం నుంచి వెళ్లిపోతాయి. సో చూడాలనుకుంటే ఈ వారంలోనే చూసేయండి మరి..!