Box Office: 300 కోట్ల హీరోలు..!
Hyderabad: కంటెంట్ బాగున్నా బాలేకపోయినా బాక్సాఫీస్(box office) కోట్లు కొల్లగొట్టేవాడే స్టార్. ఇది ఎప్పటినుంచో సినిమా రంగంలో ఉన్న అభిప్రాయం. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి తీరాల్సిందే అనుకునేవారు. ఇప్పుడు తీరు మారింది. ఏ హీరో ఏ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడు అని చూసుకుని మరీ ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కంటెంట్ లేకపోతే కనీసం OTTల్లో కూడా చూడటంలేదు. అది ఎంత పెద్ద హీరో అయినా సరే కంటెంట్ లేకపోయినా.. క్రింజ్ సీన్లు ఉన్నా ఎంత అభిమానం ఉన్నా నిజాయతీగా తమ అభిప్రాయాలను చెప్పేస్తున్నారు. 2023 వరకు చూసుకుంటే.. ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లు కొల్లగొట్టిన హీరోల లిస్ట్ ఒకసారి చూద్దాం. (box office)
సల్మాన్ ఖాన్ – 3 సినిమాలు
ఆమిర్ ఖాన్ – 6 సినిమాలు
షారుక్ ఖాన్ – 4 సినిమాలు
ప్రభాస్ – 4 సినిమాలు
అజయ్ దేవగణ్ – 3 సినిమాలు
రణ్‌బీర్ కపూర్ – 3 సినిమాలు
రణ్‌వీర్ సింగ్ – 3 సినిమాలు
హృతిక్ రోషన్ – 3 సినిమాలు
రజినీకాంత్ – 2 సినిమాలు
అక్షయ్ కుమార్ – 2 సినిమాలు
షాహిద్ కపూర్ – 2 సినిమాలు
విజయ్ – 2 సినిమాలు
ఈ లిస్ట్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టిన హీరోలది. టాలీవుడ్ నుంచి కేవలం యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ మాత్రమే ఉన్నారు. ఇందుకు కారణం ఆయన చేసిన బాహుబలి సినిమా ఫస్ట్ ప్యాన్ ఇండియన్ హిట్ అవ్వడమే. ఆ తర్వాత కోలీవుడ్ నుంచి రజినీకాంత్, విజయ్ ఉన్నారు. ఈ లిస్ట్‌లో నుంచి బాలీవుడ్ హీరోలను పక్కకు తీసేస్తే.. ఇప్పుడు రాబోయే భారీ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వరల్డ్ వైడ్ రూ.500 కోట్ల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందనే చెప్పాలి. (box office)
సలార్, కల్కి (salaar, kalki)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ (prabhas) నటిస్తున్న రెండు ప్యాన్ ఇండియన్ సినిమాలు ఇవి. సలార్ సినిమాను ప్రశాంత్ నీల్, కల్కిని (kalki 2898 ad) నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రెండు కానీ బాక్సాఫీస్ దగ్గర క్లిక్ అయితే రూ.500 కోట్లు గ్యారెంటీ అని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.
మహేష్- రాజమౌళి ఫిలిం (mahesh babu- rajamouli)
వీరిద్దరి కాంబినేషన్‌లో (ssmb 29) సినిమా రాబోతోంది అనగానే బాక్సాఫీస్ లెక్కలు ఆల్రెడీ వేసేసారు. ఎందుకంటే దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి సినిమా తీసేటప్పుడే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రూ.500కి తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేస్తారు. ఇక మహేష్ బాబుని పెట్టి తీస్తున్నాడంటే రూ.500 కోట్లు రావాల్సిందే. ఫ్యాన్స్ టూ మచ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి.
పుష్ప- ది రూల్ (pusha the rule)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) నటించిన పుష్ప సినిమా ప్యాన్ ఇండియన్ లెవల్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇంటర్నేషనల్ రేంజ్‌లో దూసుకెళ్లింది. ఇప్పుడు అంతకుమించిన ఎక్స్‌పెక్టేషన్స్‌తో పుష్ప- ది రూల్ తీస్తున్నారు సుకుమార్. పార్ట్ వన్‌కి మించిన కలెక్షన్స్ వస్తాయనడంలో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే రూ.500 కోట్లు రాబట్టే సత్తా ఉన్న సినిమాల్లో ఇదీ ఒకటి. మరి ఆ మార్క్‌ని చేరుకుంటుందో లేదో చూడాలి.
వార్-2 (war 2)
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (hrithik roshan) సినిమా వస్తోందంటేనే ఒక రూ.500 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ వస్తాయని ముందే అంచనా వేసేసుకుంటారు. అలాంటిది ఆయనతో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (jr ntr) జతకడితే? కచ్చితంగా రూ.1000 కోట్లు రాబట్టే సినిమా అవుతుంది. ఇందులో jr ntr నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఎప్పుడూ చూడని హై యాక్షన్ సీన్స్‌లో నటిస్తారని ఆల్రెడీ అయాన్ ముఖర్జీ హైప్ ఇచ్చేసారు. అలాంటప్పుడు రూ.1000 కోట్లు కలెక్షన్స్ ఎక్స్‌పెక్ట్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు.