‘రావణాసుర’ టీజర్​కి అదిరిపోతున్న రెస్పాన్స్!

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్, RT టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మోస్ట్​ అవెయిటెడ్​ ఫిలింగా ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్న ‘రావణాసుర’ సినిమాని ఏప్రిల్ 7, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల చేసిన ఫస్ట్​గ్లింప్స్​, పోస్టర్​, టీజర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తాజాగా రిలీజ్​ అయిన టీజర్​ పవర్​ఫుల్​ డైలాగ్స్​తో సినిమాపై భారీ అంచనాల్ని పెంచేసింది.

‘సీతను తీసుకుని వెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు .. ఈ రావణాసురుడిని దాటి వెళ్లాలి’ అంటూ మాస్​ మహరాజ్​ రవితేజ చెప్పే డైలాగ్ ఈ టీజర్ కి హైలైట్. ఈ టీజర్ ప్రేక్షకులని, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ కి ఇప్పటి వరకూ 9 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. మాస్ మహారాజా రవితేజ ను డిఫెరెంట్ షేడ్స్ లో చూపించడం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హీరో తాను టార్గెట్ చేసినవారిని వరుసగా అంతం చేస్తూ వెళుతుంటాడు. ఆయన చంపే తీరు కూడా రాక్షసంగా ఉంటుంది. ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్స్ గా జయరామ్ – మురళీశర్మ కనిపిస్తున్నారు. హీరో ఎందుకు అలా మారాడనేది సస్పెన్స్.అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి, రవితేజ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. వరుస అపజయాలతో సతమతమవుతున్న రవితేజకి ఈ సినిమా విజయం తప్పనిసరిగా మారింది. అందుకే ఈ చిత్ర నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే విడుదలైన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోనూ పవర్​ఫుల్​ క్యారెక్టర్​తో అలరించి ప్రశంసలందుకున్నాడు మాస్​ మహారాజ్​ రవితేజ.
సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ డిఫరెంట్ షేడ్స్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో దక్ష నగార్కర్​, పూజిత పొన్నాడ, రావు రమేష్​ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రిలీజ్ అయిన టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సినీ ప్రముఖులు సైతం ఈ టీజర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 24 గంటల్లోనే 3మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టిన ఈ టీజర్​ ప్రస్తుతం 9 మిలియన్స్​ దాటి కోటి వ్యూస్​ దిశగా దూసుకుపోతుంది.