The Kerala Story: తెలుగులో నేడే విడుదల!
Hyderabad: కేరళలో(Kerala) కొంతమంది అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే కథాంశంతో రూపొందించిన సినిమా ది కేరళ స్టోరీ(The Kerala Story). నిజ సంఘటనల ఆధారంగానే తీసామని చిత్రబృందం చెబుతున్నా.. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచీ అనేక వివాదాలను ఎదుర్కొంటోంది. అదా శర్మ(Adah Sharma), సిద్ది ఇదాని(Siddhi Idnani), యోగితా.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించగా సుదీప్తో సేన్ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా, ఈ సినిమా మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందంటూ పలు రాష్ట్రాలు బహిష్కరించాయి. వివాదాల ఎదుర్కొంటూనే కేవలం హిందీలోనే వంద కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఈ రోజు(మే 13న) తెలుగులో విడుదల కాబోతోంది.
ది కేరళ స్టోరీ సినిమా మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. కొంతమంది ఈ సినిమాను సపోర్ట్ చేస్తుంటే కొంతమంది మాత్రం సినిమాను విమర్శిస్తున్నారు. తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో ఈ సినిమాను నిషేధించగా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ట్యాక్స్ ఫ్రీ కూడా ఇచ్చారు. ది కేరళ స్టోరీ సినిమా మౌత్ టాక్ తో మంచి విజయం సాధించడంతో ఇప్పటికే సినిమా భారీ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
సినిమాకు మంచి ఆదరణ, కలెక్షన్స్ వస్తుండటంతో చిత్రయూనిట్ మరింతగా సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను వేరే దేశాల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా హిందీలో వంద కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. కొంతమంది కాలేజీ అమ్మాయిలకు ఉచితంగా ఈ సినిమా చూసే అవకాశం కల్పిస్తూ మరీ సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. మరి తెలుగులో ఈ సినిమా టాక్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!