Oscars: 2024 ఆస్కార్ వేడుక ఎప్పుడో తెలుసా?

Hyderabad: ప్రపంచ సినిమా అవార్డుల్లో అత్యున్నతమైనవి ఆస్కార్(Oscars) అవార్డ్స్. ఈ అవార్డులను గెలవాలనేది ప్రతి డైరెక్టర్​, యాక్టర్​ కల. కనీసం నామినేషన్స్ లో అయినా ఉండాలని ప్రపంచంలోని అన్ని దేశాల సినీ పరిశ్రమలు ఎదురుచూస్తాయి. ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో మన ఇండియన్​ సినిమా(Indian Cinema)లు సత్తా చాటాయి. RRR సినిమా నాటు నాటు(Naatu Naatu) సాంగ్ నామినేషన్స్ తో ఆస్కార్ బరిలో నిలవడంతో దేశమంతా సంబరాలు జరుపుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట ఆస్కార్ గెలుచుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎన్టీఆర్(NTR)​, రామ్​ చరణ్(Ram Charan)​, రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్​ లభించింది.

నాటు నాటు సాంగ్ తో పాటు ది ఎలిఫాంట్ విష్పరర్స్ సినిమా కూడా ఆస్కార్ గెలిచి భారత సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. ఇక, తాజాగా 96వ ఆస్కార్ వేడుకలకు సంబంధించిన డేట్స్ రిలీజ్ చేశారు. 2023 సంవత్సరంలో రిలీజ్ కానున్న సినిమాల కోసం ది అకాడమీ సంస్థ 2024లో ఇచ్చే అవార్డులకు డేట్స్ ని ప్రకటించింది.

ఆస్కార్ జనరల్ ఎంట్రీ కేటగిరి సబ్మిషన్ చివరి తేదీ.. బుధవారం, 15 నవంబర్ 2023, ఆస్కార్ షార్ట్ లిస్ట్ అనౌన్సమెంట్.. గురువారం, 21 డిసెంబర్ 2023, ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ అనౌన్సమెంట్.. మంగళవారం, 23 జనవరి 2024, ఆస్కార్ నామినీస్ లంచ్ కార్యక్రమం.. సోమవారం, 12 ఫిబ్రవరి 2024 96 ఆస్కార్ అవార్డుల వేడుక.. ఆదివారం 10 మార్చ్ 2024 మరి ఈ సంవత్సరానికిగానూ ఆస్కార్​ బరిలో ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి మరి!