Priyanka Chopra: న‌న్ను అండ‌ర్‌వేర్‌లో చూడాల‌న్నాడు!

Mumbai: బాలీవుడ్(Bollywood)​లో స్టార్​ హీరోయిన్​గా రాణించిన ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) ప్రస్తుతం హాలీవుడ్(Hollywood)​లో రాణిస్తూ గ్లోబల్​ స్టార్​గా మారిపోయింది. హాలీవుడ్​ సింగర్​, యాక్టర్​ నిక్​జోనాస్​ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయిన ప్రియాంక పూర్తిగా బాలీవుడ్​కి దూరమైంది. ప్రియాంక బాలీవుడ్​కి దూరమవడంపై చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవలే కంగనా రనౌత్​ కూడా ప్రియాంకని ఉద్దేశపూర్వకంగానే బాలీవుడ్​ నుంచి పంపించేశారని కామెంట్స్​ చేసింది. కాగా, తాజాగా ప్రియాంక ఓ డైరెక్టర్​ తనపట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు చెప్పుకొచ్చింది.

‘కెరీర్​ ఆరంభంలో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఓ బాలీవుడ్​ డైరెక్టర్​ నన్ను అండర్​వేర్​లో చూడాలి అన్నాడు. సినిమా షూటింగ్​ జరుగుతోంది. అక్కడే నన్ను లోదుస్తులు కనపడేలా బట్టలు తీసేయమన్నాడు. లేకపోతే ఈ సినిమా ఎవరు చూస్తారు అంటూ తన అసిస్టెంట్​కి చెప్పాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. ఆ సినిమా నుంచి తప్పుకున్నా. అతన్ని ఏమీ అనలేకపోయా. భయంతో ఆరోజు మాట్లాడకపోవడం నేను చేసిన తప్పు. నేను అన్ని విషయాలను బాహాటంగా పంచుకోలేను. అదే నాకున్న అతిపెద్ద సమస్య’ అంటూ కెరీర్​ ఆరంభంలో తను ఎదుర్కొన్న పరిస్థితులను చెప్పుకొచ్చింది ప్రియాంక.

సినీపరిశ్రమలో హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్లలో తేడా గురించి కూడా ప్రియాంక పలు సందర్భాల్లో ఓపెన్​గానే కామెంట్స్​ చేసింది. ప్రస్తుతం ప్రియాంక సిటాడెల్(Citadel)​ అనే అమెరికన్​ వెబ్​ సిరీస్​తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సిరీస్​లో ప్రియాంక నటనకు ప్రముఖుల నుంచీ ప్రశంసలు అందుతున్నాయి.