Thaman: 10 లక్షల సాయం.. హ్యాట్సాఫ్​ అంటున్న నెటిజన్లు!

Hyderabad: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్(Thaman S) అంటే బ్యాగ్రౌండ్​ మ్యూజిక్​కి పెట్టింది పేరు. తను చేసే ప్రతి సినిమాలోనూ కొత్తకొత్త ట్యూన్స్​తో ఆడియన్స్​ని ఉర్రూతలూగిస్తుంటారు. థమన్ అందించే సంగీతానికే కాదు, వ్యక్తిగతంగానూ అభిమానులను సంపాదించుకున్నారు థమన్​. మ్యూజిక్ డైరెక్టర్ గా, క్రికెట్ ప్లేయర్ గా ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు

ఇక, తాజాగా థమన్ చేసిన ఒక పనికి నెటిజెన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు. ప్రముఖ తెలుగు ఓటిటి ఆహా(Aha)లో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ కి థమన్, గీతామాధురి జడ్జిలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో థమన్ చేసిన ఒక మంచి పనిని ఆడియన్స్ కి తెలియజేసింది గీతామాధురి. హాస్పిటల్​లో కట్టేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న ఓ మ్యూజీషియన్​కి థమన్​ చేయూతనిచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే వెంటనే థమన్​ వారికి 10 లక్షలు ఇచ్చినట్లు గీతామాధురి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.డకాగా టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ అన్ని థమన్ చేతిలోనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ OG, మహేష్ బాబు SSMB28, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ NBK108. మరి ఈ సినిమాల్లో థమన్ ఎలాంటి ట్యూన్స్​తో ఫ్యాన్స్​ని ఉర్రూతలూగిస్తారో చూడాలి మరి!