TG Vishwa Prasad: ఆ లోఫ‌ర్ వెబ్‌సైట్ ట్విస్ట్‌ల‌న్నీ చెప్పేసి రివ్యూ రాసేసింది

TG Vishwa Prasad slams a website who wrote bad review about great andhra

TG Vishwa Prasad: శ్రీవిష్ణు న‌టించిన స్వాగ్ సినిమా ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో సినీ నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటుచేసారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. చాలా మ‌టుకు సినిమా బాగుంద‌న్న టాకే వినిపించ‌ద‌ని అన్నారు. అయితే ఒక వెబ్‌సైట్ మాత్రం ట్విస్ట్‌ల‌న్నీ రివీల్ చేసేసి రివ్యూ రాసేసింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. “” ఒక వెబ్ సైట్ ఉంది. దానిని లోఫ‌ర్ వెబ్‌సైట్ అనాలో బ‌ఫూన్ వెబ్‌సైట్ అనాలో అర్థంకావ‌డంలేదు. ట్విస్ట్‌ల‌న్నీ రివీల్ చేసేసి రివ్యూ అని రాసేసింది. ఒక గుర్తింపు ఉన్న వ్య‌క్తి ఇలాంటి మాట‌లు మాట్లాడ‌కూడ‌దు. కానీ త‌ప్పడం లేదు. నేను నా మాట‌లు వెన‌క్కి తీసుకుంటా. అదే విధంగా ఆ ట్విస్ట్‌లు రాసిన వెబ్‌సైట్ వెంట‌నే దానిని రివ్యూ నుంచి తొల‌గిస్తే బాగుంటుంది “” అంటూ ఆయ‌న మీడియా ముందు మండిప‌డ్డారు.