TG Vishwa Prasad: నైట్ డ్రెస్ మాత్ర‌మే కామ‌న్‌..!

Hyderabad: బ్రో (bro) కాంట్రొవ‌ర్సీపై నిర్మాత టీజీ విశ్వ ప్ర‌సాద్ (tg vishwa prasad) స్పందించారు. ఇందులో 30 ఇయ‌ర్స్ పృథ్వీని పెట్టి YSRCP మంత్రి అంబ‌టి రాంబాబు (ambati rambabu) డ్యాన్స్ వేసిన సీన్ పెట్టించార‌ని అంబ‌టి మండిప‌డుతున్నారు. నిన్న‌టి నుంచి తెగ ప్రెస్ మీట్లు పెట్టి మ‌రీ సినీ నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, రైట‌ర్లు (ముఖ్యంగా త్రివిక్ర‌మ్)ల‌కు వార్నింగ్‌లు ఇస్తున్నారు.

ఈ వివాదంపై విశ్వ ప్ర‌సాద్ స్పందించారు. “” నేను కూడా అంబ‌టి వీడియో చూసాను. ఆయ‌న సింక్ అదిరేలా డ్యాన్స్ చేసారు. కానీ శ్యాంబాబు డ్యాన్స్ సింక్ కాలేదు. నాకు వారిద్ద‌రిలో నైట్ డ్రెస్ కామ‌న్‌గా అనిపించే త‌ప్ప ఇంకేమీ కామ‌న్‌గా లేదు “” అని తెలిపారు. ఇక బ్రో  క‌లెక్ష‌న్ల (bro collections) గురించి రాంబాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా స్పందించారు. రూ.100 కోట్లు దాటేసింది అని త‌ప్పుడు క‌లెక్ష‌న్లు చెప్తున్నారు కానీ అక్క‌డ వ‌చ్చింది కేవ‌లం రూ.60 కోట్లేన‌ని రాంబాబు ఆరోపించారు.

దీనికి విశ్వ ప్ర‌సాద్ స్పందిస్తూ.. సినిమాకు అయిన ఖ‌ర్చ ఎంత‌, హీరోకి ఎంత ఇచ్చాం, ఎన్ని క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి వంటి విష‌యాల‌న్నీ అంద‌రికీ చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు.