TG Vishwa Prasad: హ‌రీష్ శంక‌ర్ వ‌ల్లే మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ దొబ్బంది

TG Vishwa Prasad blames harish shankar for mr bachchan flop

TG Vishwa Prasad: హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌కు విప‌రీత‌మైన నెగిటివిటీ వ‌చ్చింది. ర‌వితేజ నా ప్రాణం అంటూనే ఆయ‌నకు మ‌ర్చిపోలేని ఫ్లాప్ ఇచ్చాడు. భాగ్య‌శ్రీ బోర్సే అనే అమ్మాయి హీరోయిన్‌గా పెట్టి.. ఆ అమ్మాయితోనే హిట్ కొట్టేయ‌చ్చు అనుకున్నాడు.  కానీ డివైడెడ్ టాక్, ట్రోల్స్, నెగిటివిటీతో సినిమా ఫ్లాప్ అయిపోయింది. అదీకాకుండా ఆయ‌న గ్రేట్ ఆంధ్ర జ‌ర్న‌లిస్ట్ మూర్తికి ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌డం మ‌రో వివాదంగా మారింది. మిస్ట‌ర్ బచ్చ‌న్ ఫ్లాప్ అవ్వ‌డానికి కార‌ణం హ‌రీష్ శంక‌రే అని నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ కూడా అభిప్రాయ‌ప‌డ్డారు. సినిమాలో మ్యాట‌ర్ ఉంటే తాను కూడా హ‌రీష్ శంకర్‌ను చుట్టుముడుతున్న నెగిటివిటీపై స్పందించేవాడ‌నని.. కానీ ఆ అవ‌కాశం లేకుండా పోయింద‌ని ఆయ‌న అన్నారు.