త్రివిక్ర‌మ్‌పై ఆరోప‌ణ‌లు.. నిర్మాత ఆడియో లీక్

telugu producer comments on poonam kaur

Poonam Kaur: నటి పూన‌మ్ కౌర్‌.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌పై మ‌రోసారి లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో ఓ తెలుగు నిర్మాత ఆడియో ఫైల్ లీకైంది.

“” సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్ క్యారెక్ట‌ర్ , చిన్న రోల్స్ చేసే ఆర్టిస్ట్స్ అంతగా ఆదాయం లేని చిన్న ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు కూడా నెలకి లక్షల రూపాయల ఖర్చు అయ్యే మైంటెనన్స్ ఎలా చేస్తున్నారు? ఖరీదైన కార్లు ఎక్కడివి? అందులో కొందరు వ్యభిచారం, ప‌ర‌స్ప‌ర అంగీకారంతో శృంగారం, ఎఫైర్లు పెట్టుకుని చివరికి అవతలి వాడు పెద్దవాడు అయ్యాక పదేళ్ల త‌ర్వాత‌ ఆరోపణలు చేయడం సమంజసమా? “” అని స‌ద‌రు నిర్మాత ఆ ఆడియోలో మాట్లాడ‌టం వైర‌ల్‌గా మారింది. అయితే ఆయ‌న పూన‌మ్ కౌర్ గురించి అన్నారా? లేక మ‌రెవ‌రి గురించైనానా అనేదానిపై క్లారిటీ లేదు.

కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్టర్‌పై ఓ యువ‌తి అత్యాచార కేసు పెట్టిన నేప‌థ్యంలో చిత్ర ప‌రిశ్ర‌మ స్పందించి ముందుకొచ్చింది. ఈ నేప‌థ్యంలో తాను ఎప్ప‌టి నుంచో త్రివిక్ర‌మ్ గురించి ఫిర్యాదు చేస్తున్నా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేద‌ని.. క‌నీసం ఇప్పుడైనా త‌న విష‌యంలో త్రివిక్ర‌మ్ ఏం చేసాడో బ‌య‌టికి రావాల్సి ఉంద‌ని..ఆయ‌న్ను కూడా చిత్ర ప‌రిశ్ర‌మ పెద్ద‌లు పిలిపించి విచారించాల‌ని పూన‌మ్ కౌర్ ట్వీట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.