Dhanush: ధ‌నుష్‌కి ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ రెడ్ కార్డ్

Chennai: ధ‌నుష్‌కి (dhanush) కోలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ రెడ్ కార్డ్ ఇవ్వ‌నుంది. కొన్ని నెల‌ల క్రితం శ్రీ తెనాండ‌ల్ ఫిలింస్ (sri thenandal films) సంస్థ‌తో ధ‌నుష్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆయ‌న డేట్స్ ఇచ్చి మ‌రీ షూటింగ్‌ల‌కు రావ‌డంలేద‌ట‌. దాంతో తెనాండ‌ల్ ఫిలింస్‌కి న‌ష్టం వాటిల్లింది. దాంతో వారు కోలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్‌ను ఆశ్ర‌యించారు. గ‌తంలో ఎస్‌.జే సూర్య‌ (sj suryah), శింబు (simbu), విశాల్‌కి (vishal)కూడా ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ రెడ్ కార్డు ఇచ్చింది.