Soumya: ఆ దర్శకుడు నా యోనిలో రాడ్డు పెట్టి శునకానందం పొందాడు
Soumya: ఓ పక్క హేమ కమిటీ రిపోర్టులో వెల్లడైన అంశాలు బయటికి రావడంతో మలయాళ చిత్ర పరిశ్రమలో కల్లోలం సృష్టించింది. ఇదే మంచి సమయం అనుకుని తమిళ ఇండస్ట్రీ వారు కూడా ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తమకు జరిగిన లైంగిక వేధింపులను బయటపెడుతున్నారు. సీనియర్ తమిళ నటి అయిన సౌమ్య అనే మహిళ తన పట్ల ఓ దర్శకుడు చేసిన దారుణాన్ని మీడియా ద్వారా బయటపెట్టారు. తనకు 18 ఏళ్ల వయసున్నప్పుడు ఓ దర్శకుడు తనను ఓ సినిమా కోసం కలిసాడని.. ఆరోజు నుంచి తనకు మెంటల్ టార్చర్ పెట్టాడని తెలిపారు. తనతో ఓ బిడ్డను కూడా కనాలని చూసాడని ఆరోపించారు.
తన యోనిలో రాడ్డు పెట్టి శునకానందం పొందాడని.. ఒకవేళ పోలీసులు తన కేసును టేకప్ చేస్తేనే ఆ దర్శకుడి పేరు వివరాలు బయటపెడతానని అన్నారు. “” నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడు నా కాలేజ్‌లో జరిగిన ఓ డ్రామాలో నేను నటించాను. అలా నాకు తమిళ చిత్ర పరిశ్రమలో నటించే అవకాశం వచ్చింది. మాది చిన్న కుటుంబం. నా తల్లిదండ్రులకు సినిమా ప్రపంచం తెలీదు. ఆ సమయంలో మా ఇంటికి ఒక వీధి అవతలే సీనియర్ నటి రేవతి ఉండేవారు. ఆమెను నేను ఎంతో ఆరాధించేదాన్ని.
సినిమాల్లో అవకాశం అనగానే రంగుల ప్రపంచాన్ని ఊహించుకున్నాను. అలా తొలి ఆడిషన్‌కు వెళ్లాను. అయితే ఆడిషన్ సమయంలోనే నా చేత తప్పుడు పనులు చేయిస్తున్నారని అర్థమైంది. దాంతో నేను సినిమా చేయను అని చెప్పేసాను. కానీ ఆ దర్శకుడు తన భార్యను నా ఇంటికి పంపి మీ అమ్మాయిపై చాలా డబ్బు ఖర్చుపెట్టాం. ఇప్పుడేమో మీ అమ్మాయి నటించను అంటోంది అని నా తల్లిదండ్రులకు నా గురించి లేనిపోనివి చెప్పారు. మా అమ్మానాన్నల కోసం అయిష్టంగానే ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను.
డాక్యుమెంట్లలో ఆ దర్శకుడి భార్యే సినిమాను డైరెక్ట్ చేస్తారు అని ఉంది. కానీ సెట్స్‌లో మాత్రం అతనే డైరెక్ట్ చేసేవాడు. నన్ను చాలా బాగా చూసుకుంటున్నట్లు నటించి ఇంటికి తీసుకెళ్లి తినడానికి అన్నీ ఇచ్చేవారు. అలా ఓ రోజు ఆ దర్శకుడు నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా దాదాపు ఏడాది పాటు నాపై అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు. ఈ దారుణ ఘటన నుంచి కోలుకోవడానికి నాకు 30 ఏళ్లు పట్టింది. నాలాగా ఇలాంటి దారుణాలకు గురైన వారు ఇప్పటికైనా ధైర్యంగా బయటికి వచ్చి చెప్పాల్సిందిగా కోరుతున్నాను “” అని వెల్లడించారు.