Odela 2: షాకింగ్ స‌ర్‌ప్రైజ్‌తో మిల్కీ బ్యూటీ ఎంట్రీ

Odela 2: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (Tamanna) షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఓదెల 2 అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందులో త‌మ‌న్న శివ‌య్య‌కు ప‌ర‌మ భ‌క్తురాలిగా క‌నిపించ‌నున్నారు. పోస్ట‌ర్ కూడా చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ఇందులో శివ శ‌క్తి పాత్ర‌లో త‌మ‌న్నా న‌టిస్తున్నారు. సంప‌త్ నంది సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

టాలీవుడ్‌ను త‌న అంద‌చందాల‌తో ఒక ఊపు ఊపిన త‌మ‌న్నా.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ రాణిస్తోంది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నంత కాలం ముద్దు సీన్ల‌కు నో చెప్పిన త‌మ‌న్నా.. తొలిసారి బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌తో లిప్ లాక్ సీన్‌లో న‌టించింది. విజయ్ వ‌ర్మ‌తో త‌మ‌న్నా ప్రేమ‌లో ఉంది. అందుకే అత‌నికి మాత్ర‌మే ముద్దుపెట్టాన‌ని చెప్పింది. ప్రస్తుతానికి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో మాత్ర‌మే న‌టిస్తోంది. ఈ ఏడాది త‌మ‌న్నా, విజయ్ వ‌ర్మ‌లు పెళ్లి పీట‌లు ఎక్కుతార‌న్న టాక్ వినిపిస్తోంది. ఈలోగా త‌న చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసేయాల‌ని త‌మ‌న్నా అనుకుంటోంద‌ట‌.