Tamanna: విజ‌య్‌తో సినిమా.. ఫ్లాప్ అవుతుంద‌ని తెలుసు

Hyderabad: కావాలా సాంగ్‌తో ఇప్పుడు ఎక్క‌డ చూసినా ట్రెండింగ్‌లో ఉన్నారు మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (tamanna). అన్ని భాష‌ల్లోనూ ఈ సాంగ్ వైర‌ల్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విష‌యాలు వెల్ల‌డించారు. కెరీర్ స్టార్టింగ్‌లో దళ‌ప‌తి విజ‌య్‌తో (vijay) క‌లిసి సుర (sura) అనే సినిమాలో న‌టించారు త‌మ‌న్నా. ఆ సినిమా గురించి చెప్తూ.. షూట్ చేస్తున్న‌ప్పుడే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంద‌ని అర్థ‌మైపోయింద‌ని అన్నారు. చాలా సీన్ల‌లో త‌ను అస్స‌లు బాలేనని, కానీ డైరెక్ట‌ర్ ఓకే చేసేసాక ఇంకేమీ చేయ‌లేం కాబ‌ట్టి వ‌చ్చింది చేసుకుంటూ వెళ్లిపోయాన‌ని అన్నారు. (tamanna)

ఇక తాను వ‌ర్క్ చేసిన హీరోల గురించి కూడా ఎన్నో విష‌యాలు పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) చాలా నాటీ ప‌ర్స‌న్ అని అన్నారు. ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (prabhas) మాస్, స్టైలిష్ అని అన్నారు. ప్ర‌భాస్ (prabhas) గురించి చెప్ప‌మంటే అంద‌రూ చెప్పే మాటే (డార్లింగ్) చెప్పారు. NTR గురించి చెప్తూ ఆయ‌న ఆల్ రౌండ‌ర్ అని కితాబిచ్చారు. అల్లు అర్జున్ (allu arjun) స్టైలిష్ స్టార్ అని, రామ్ చ‌ర‌ణ్ (ram charan) రాయ‌ల్ అని పొగిడేస్తున్నారు త‌మ‌న్నా.