Tamanna: ఫైనల్లీ బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పేసిన మిల్కీ బ్యూటీ
Hyderabad: మిల్కీ బ్యూటీ తమన్నా (tamanna) మొత్తానికి తన బాయ్‌ఫ్రెండ్ గురించి బయటపెట్టింది. కొంతకాలంగా నటుడు విజయ్ వర్మతో (vijay verma) తమన్నా డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ వీరిద్దరూ దాని గురించి అస్సలు స్పందించలేదు. వీరు జంటగా లస్ట్ స్టోరీస్-2 (lust stories 2) వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా.. తన లవ్ లైఫ్ గురించి మాట్లాడారు. “నాతో కలిసి నటించినంత మాత్రాన నేను ఫలానా వ్యక్తిని ప్రేమించను. నేను చాలా మందితో కలిసి నటించాను. కానీ విజయ్ వర్మతోనే నాకు ఆ కనెక్షన్ కుదిరింది. నేను విజయ్‌ని ఇష్టపడ్డాను అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అది నా పర్సనల్. అంతేకానీ అతను బాలీవుడ్ నటుడు కాబట్టి నేను ఇష్టపడ్డాను అని కాదు. నాకు విజయ్‌కి మధ్య బాండింగ్ ఆర్గానిక్‌గానే జరిగింది. ఉన్నత స్థానాల్లో ఉండే ఆడవారు ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తుంటారు. మనకు దక్కాల్సినవన్నీ ఎంతో కష్టపడితేనే వస్తాయి అని. అలా ఆలోచించి సింపుల్ విషయాలను కూడా పట్టించుకోకుండా ఉంటారు. మనకు నచ్చినవారితో ఉండాలంటే మనల్ని మనం ఎంతో మార్చుకోవాలి అనుకుంటారు. కానీ విజయ్ అలా కాదు. తను నా అచీవ్‌మెంట్స్‌ని ఎంతో గౌరవిస్తాడు. తను నా పక్కన ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటా” అని వెల్లడించారు. మరి విజయ్ తమన్నాల పెళ్లి ఎప్పుడనేది వేచి చూడాలి.