Tamanna: మేం ఫ్యామిలీతో చూడాలి కానీ నువ్వు చూడలేవా..?
Hyderabad: తమన్నా (tamanna) డబుల్ స్టాండర్డ్స్ బయటపడ్డాయి. ఆమె నటించిన లస్ట్ స్టోరీ-2 (lust stories 2) సినిమా నిన్న రిలీజ్ అయింది. ఇందులో తమన్నా (tamanna) తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి నటించారు. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి సెక్సువల్ సీన్ల డోస్ పెంచుకుంటూ పోయారు డైరెక్టర్లు. ఇందులో తమన్నా, విజయ్ వర్మల (vijay verma) కిస్సింగ్ సీన్లలో కూడా నటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఒక్క రోజు ముందు తమన్నా ఒక డైలాగ్ వేసారు. లస్ట్ స్టోరీస్ అనే పేరు చూసి మోసపోకండి.. ఇది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అన్నారు. తీరా చూస్తే అసలు ఫ్యామిలీతో కాదు కదా.. ఫ్రెండ్స్‌తో కూడా చూడలేని విధంగా ఉన్నాయి కొన్ని సీన్లు అయితే. అయితే ఆడియన్స్‌కేమో ఫ్యామిలీతో చూడండి అనింది.. తను మాత్రం ఇలాంటి సినిమాలు ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడలేను అని చెప్తోంది. అలాంటి సీన్లు వచ్చినప్పుడు చాలా ఎంబారెసింగ్‌గా ఉంటుందని ఓ సందర్భంలో చెప్పింది. పాపం తమన్నా మాటలు విని ఫ్యాన్స్ ఫ్యామిలీతో లస్ట్ స్టోరీస్-2 చూడాలని ప్లాన్ చేసుకున్న వారి పరిస్థితేంటో..!