Tamanna: బాయ్‌ఫ్రెండ్ కోసం నో కిస్ పాలసీని బ్రేక్ చేసేసింది!
Hyderabad: మిల్కీ బ్యూటీ తమన్నా (tamanna) 18 ఏళ్లుగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో రాణిస్తూ వచ్చింది. తెలుగులో ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. 17 ఏళ్ల వయసులోనే శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్‌తో నో కిస్ పాలసీ గురించి చెప్పి అగ్రీమెంట్ రాయించుకుంది. అంటే సినిమాలో ఎలాంటి లిప్ కిస్సింగ్ సీన్స్‌లో నటించకూడదని అప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కెరీర్ టాప్‌లో ఉన్న తమన్నా (tamanna) సడెన్‌గా ఈ పాలసీని బ్రేక్ చేసింది. అది కూడా తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ (vijay verma) కోసమేనని బాలీవుడ్ వర్గాల సమాచారం. తమన్నా లస్ట్ స్టోరీస్ 2 (lust stories 2) అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇందులో తమన్నా, విజయ్ వర్మల మధ్య కిస్, సెక్స్ సీన్స్ ఉన్నాయి.
అంతేకాదు.. తను ఎవరికోసమైనా నో కిస్ పాలసీని బ్రేక్ చేస్తాను అంటే అది కేవలం గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్ (hrithik roshan) కోసమేనని కొన్నేళ్ల క్రితం మీడియా ముందు తెలిపింది తమన్నా. మరి ఇప్పుడు బాయ్‌ఫ్రెండ్ కోసమే ఆ సీన్స్‌లో నటించడానికి ఒప్పుకుందేమో అన్న టాక్ కూడా మొదలైంది. ఇదే విషయం గురించి ప్రశ్నిస్తే.. స్క్రిప్ట్ కోసమని చేయక తప్పలేదు. అంతేకానీ ఏదో ఫేమస్ అయిపోవాలని అలాంటి సీన్లలో నటించలేదు అని తెలిపింది. అసలు తమన్నా (tamanna) ఇలాంటి క్యారెక్టర్‌కి ఎలా ఒప్పుకుందా? అని ఇప్పటికీ ఫ్యాన్స్ షాక్‌లో ఉన్నారు.