Tamanna: శారీరకంగా కలిసారా.. తమన్నాకు జర్నలిస్ట్ ప్రశ్న
Mumbai: మిల్కీ బ్యూటీ తమన్నా (tamanna) ఇప్పుడు చాలా మారిపోయారనే చెప్పాలి. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్నప్పుడు ఎలాంటి లిప్ కిస్ సీన్లలో టూ మచ్ రొమాంటిక్ సీన్లలో ఎప్పుడూ నటించలేదు. సినిమాకు ముందు ఆమె నో కిస్ పాలసీ గురించి చెప్పాక స్క్రిప్ట్‌కి ఓకే చెప్తారు. ఇందుకు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా ఓకే చెప్పేవారు. కానీ ఇప్పుడు తమన్నా మారిపోయారు. తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో (vijay verma) కలిసి లస్ట్ స్టోరీస్ 2లో (lust stories 2) తమన్నా (tamanna) లిప్ కిస్, రొమాంటిక్ సీన్స్‌లో నటించారు. ఇక జీ కర్దా (jee karda) అనే వెబ్ సిరీస్‌లో అయితే ఏకంగా సెక్స్ సీన్లలో నటించేసారు. ఇప్పుడు తమన్నాలో ఇంత మార్పు ఏంటి అని అడిగితే.. గతంలో ఇలాంటి చేయలేదు.. ఇక నటి అన్నాక అన్ని రకాల సీన్స్‌లో నటిస్తేనే కదా కెపాసిటీ ఏంటో తెలిసేది అని చెప్పారు.
ఇక లస్ట్ స్టోరీస్-2 ప్రొమోషన్స్‌లో తమన్నాను (tamanna) ఓ జర్నలిస్ట్ అడగకూడదని ప్రశ్న అడిగారు. ఎటూ తమన్నా, విజయ్ ప్రేమలో ఉన్నామని కన్ఫామ్ చేసేసారు కాబట్టి.. ఫస్ట్ డేట్‌కి వెళ్లినప్పుడు శారీరకంగా కలిసారా అని అడిగేసాడు. అది విని తమన్నా కాస్త అసౌకర్యంగా ఫీలయ్యారు కానీ లేదు అని చెప్పి ఊరుకున్నారు. ఇక విజయ్‌ని అడిగితే కూడా లేదు అని చెప్పి తప్పించుకున్నారు. పాపం తమన్నాకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవడం ఇదే మొదటిసారి. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్నప్పుడు ఏ మీడియా కూడా ఇలాంటి దిక్కుమాలిన క్వశ్చన్స్ అడగలేదు.