Taapsee Pannu: ప్రియుడిని రహస్యంగా వివాహం చేసుకున్న నటి
Taapsee Pannu: నటి తాప్సి పన్ను తన ప్రియుడైన మథియాస్ బోని (Mathias Boe) రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 23న వీరి వివాహం రహస్యంగా జరిగిపోయినట్లు సమాచారం. తన వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకోనని తాప్సి ఆల్రెడీ వెల్లడించారు. అందుకోసమే వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగినట్లు తెలుస్తోంది. డెన్మార్క్‌కి చెందిన మాజీ ఒలింపిక్ మెడలిస్ట్ అయిన మథియాస్ బో.. తాప్సి చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ వేడుకకు కేవలం దర్శకుడు అనురాగ్ కశ్యప్, తాప్సికి ఎంతో దగ్గరివారైన నటీనటులు మాత్రమే హాజరయ్యారు.