Swastika Mukherjee: సీనియ‌ర్ న‌టి సెక్స్ సీన్ లీక్

Swastika Mukherjee: ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి స్వ‌స్తికా ముఖ‌ర్జీ చేసిన ఓ సెక్స్ సీన్ ట్విట‌ర్‌లో లీక్ అయ్యింది. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా క‌పూర్ తీస్తున్న ల‌వ్ సెక్స్ ఔర్ ధోకా 2 సినిమాలో స్వ‌స్తిక కీల‌క పాత్ర‌లో న‌టించారు. అయితే ఈ సినిమాలో భాగంగా స్వ‌స్తిక సెక్స్ సీన్‌లో న‌టించారు. అది మ‌రీ హ‌ద్దులు దాటి మ‌రీ తీసిన సన్నివేశం. సినిమా ఇంకా రిలీజ్ అవ్వ‌కుండా ఆ ఒక్క సెక్స్ సీన్ లీక్ అయిపోయింది.

ఒరిజిన‌ల్ వీడియో నా ద‌గ్గ‌ర ఉంది. చూసి వెళ్లిపోకుండా నా ఖాతాను ఫాలో అవ్వండి అంటూ ఓ నెటిజ‌న్ ట్విట‌ర్‌లో షేర్ చేయ‌డంతో వైరల్‌గా మారింది. ఈ విష‌యం ప‌ట్ల స్వ‌స్తిక తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసారు. దీనిపై నిర్మాత ఏక్తా క‌పూర్ స్పందిస్తూ.. ఈ ప‌ని చేసిన వారిని వ‌దిలిపెట్ట‌మ‌ని.. క‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. అంతేకానీ ఇలాంటి సన్నివేశాలు లేకుండా ఆమె సినిమాలు కానీ సిరీస్‌లు కానీ తీయ‌ను అని మాత్రం చెప్ప‌డంలేదు.