Sushant Singh Rajput: సూసైడ్ కంటే ఎక్కువే ఏదో జరిగింది
Sushant Singh Rajput: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం గురించి ఆయన సోదరి శ్వేత సింగ్ కీర్తి (Shweta Singh Kirti) షాకింగ్ ఆరోపణలు చేసారు. సుశాంత్ చనిపోయి నాలుగేళ్లు అవుతున్నా కూడా ఇంకా ఈ కేసు విషయం ఏ కొలిక్కి రాలేదని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్వేతా సింగ్ కీర్తి…ఇప్పటివరకు సుశాంత్ కేసును డీల్ చేస్తున్న ముంబై CBI ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసారు. సుశాంత్ ఆత్మహత్య విషయంలో అంతకుమించి ఏదో జరిగిందని తాను బలంగా నమ్ముతున్నట్లు శ్వేత తెలిపారు.
“” త్వరగా కేసు విచారణ చేసి సుశాంత్ విషయంలో ఏం జరిగిందో సీబీఐ మనకు తెలిసేలా చేసేలా మనమంతా కృషి చేయాలి. సుశాంత్ తన గదిలోని బెడ్‌పైకి ఎక్కి ఉరేసుకున్నాడు అని చెప్తున్నారు. అసలు సుశాంత్ హైట్‌కి ఆ బెడ్ ఎక్కి స్టూల్ని తన్నే అవకాశం లేదు. అదీకాకుండా అపార్ట్మెంట్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు తాళాలు వాచ్‌మ్యాన్‌కి ఇచ్చి వెళ్తారు. కానీ సుశాంత్ తాళాలు ఇవ్వలేదట. అడిగితే తాళాలు ఎక్కడో మిస్ అయ్యాయి అంటున్నారు. (Sushant Singh Rajput)
పోనీ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దామా అంటే సుశాంత్ చనిపోయిన రోజు కానీ ఆ ముందు రోజు కానీ అసలు ఏమీ విజువల్స్ రికార్డ్ అవ్వలేదు. సీసీటీవీ కూడా పాడైంది అంటున్నారు. సుశాంత్ అసలు తన గదికి తాళం వేసుకోడు. కానీ సుశాంత్ చనిపోయిన రోజు గదికి తాళం వేసి ఉంది. ఇలా ఏ పాయింట్ తీసుకున్నా కూడా సహజంగా అనిపించడంలేదు. ప్రతీ పాయింట్ అనుమానాస్పదంగానే ఉంది. అలాంటప్పుడు నా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని ఎలా నమ్మాలి? మన భారతదేశంలో గొప్ప గొప్ప ఇన్వెస్టిగేటర్లు ఉన్నారు. వారి సాయంతో సుశాంత్ విషయంలో ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగానే సుశాంత్ సూసైడ్ చేసుకుని ఉంటే.. ఎందుకు చేసుకున్నాడో కూడా చెప్పమనండి.
నా కుటుంబం ఎంత బాధను అనుభవించిందో ఎవ్వరికీ తెలీదు. తమ బిడ్డ ఎలా చనిపోయాడో తెలుసుకునే హక్కు తల్లిదండ్రులకు, కుటుంబీకులకు ఉంటుంది. సీబీఐ విచారణ కోసం కోరాం. దానిపై కూడా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. అసలు కేసు గాలికి వదిలేసారేమో అనిపిస్తోంది. నేను ఇన్వెస్టిగేటర్ని కాను. నేను కేసును ఇన్వెస్టిగేట్ చేయలేను. నన్ను ఇప్పటివరకు సుశాంత్ ఉంటున్న ఫ్లాట్‌కి కూడా వెళ్లనివ్వలేదు. కాబట్టి సీబీఐ మా బాధను అర్థం చేసుకుని వెంటనే విచారించాలి. విచారించి ఆధారాలతో పాటు మాకు ఏం జరిగిందో తెలియజేయాలని కోరుతున్నాం “”” అని తెలిపారు.