Sushant Singh Rajput: నా తమ్ముడు ఎలా చనిపోయాడో త్వరలో తెలియాలి
Sushant Singh Rajput: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి నాలుగేళ్లు అవుతున్న ఇంకా ఇతని కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. 2020 జూన్‌లో సుశాంత్ తన నివాసంలో ఉరేసుకుని చనిపోయాడు. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని షాక్‌కు గురిచేసింది. అప్పటివరకు బాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంటున్న సుశాంత్ ఎందుకు ఉన్నట్టుండి ఉరేసుకోవాల్సి వచ్చింది? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. (Sushant Singh Rajput)
ALSO READ: Rhea Chakraborty: సుశాంత్ లేకుండా బతకడం చాలా కష్టం
త్వరలో కేసును తేల్చండి
మరోపక్క సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ పోలీసులపై మండిపడుతూ ఓ పోస్ట్ పెట్టారు. తన తమ్ముడు ఎలా చనిపోయాడో తమకు తెలియాలని త్వరలో ఈ కేసును ఓ కొలిక్కి తీసుకురావాలని పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న శ్వేత తన తమ్ముడి కోసం పెయిన్ : ఏ పోర్టల్ టు ఎన్లైటెన్మెంట్ అనే పుస్తకాన్ని రాసారు. దానిని ప్రచురించేందుకు అమెరికా నుంచి ఇండియా వచ్చిన శ్వేతా సింగ్ సీబీఐ ఇంకా కేసులో ఎలాంటి అప్డేట్లు ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. ప్రతిసారి న్యాయం కోసం అడుక్కోవాల్సి వస్తోందని బాధపడ్డారు.
ALSO READ: Disha Salian: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ ఆత్మహత్యపై సిట్ విచారణ