Suriya: బోయ‌పాటితో సూర్య‌..?

ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను.. (boyapati srinu) త‌న త‌దుప‌రి సినిమాను సూర్య‌తో (suriya) తీయాల‌నుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. బోయ‌పాటి అంటేనే మాస్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు పెట్టింది పేరు. సూర్య కూడా సింగం ఫ్రాంచైస్‌తో త‌నలో క్యూట్ ల‌వ‌ర్ బాయే కాకుండా మాస్ హీరో కూడా ఉన్నాడ‌ని నిరూపించుకున్నాడు. సో వీరిద్ద‌రూ క‌లిసి ఒక సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడైతే సూర్య కంగువ (kanguva) అనే సినిమాతో బిజీగా ఉన్నారు.. మ‌రోప‌క్క బోయ‌పాటి రామ్ పోతినేని కాంబోలో వ‌చ్చిన స్కంద (skanda) సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది.