Suriya: బాహుబలిలో అవకాశం వదులుకున్నా.. తప్పు తెలిసింది
Suriya: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి సినిమా భారతీయ సినిమా రంగాన్నే తిరగరాసింది. అప్పటివరకు ఒకలా ఉన్న టాలీవుడ్.. బాలీవుడ్‌కి ముందు ఆ తర్వాత అనే పరిస్థితికి వచ్చేసింది. అయితే రాజమౌళి ఈ సినిమా తీస్తున్న సమయంలో కొన్ని పాత్రల కోసం కొందరు నటులను సంప్రదించారు. సినిమా అంతగా ఆడదేమో అనే అనుమానంతో వారంతా నో చెప్పారు. అందులో ప్రముఖ తమిళ నటుడు సూర్య ఒకరు. కీలక పాత్ర కోసం జక్కన్న సూర్యను సంప్రదిస్తే ఆయన తిరస్కరించారట. ఈ విషయాన్ని సూర్య ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు. ఆ తప్పు ఇప్పుడు తెలిసిందని.. ఇక ముందు రాజమౌళి తనను ఏ పాత్రకైనా సంప్రదిస్తే చిన్నదా పెద్దదా అని కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేస్తానని అన్నారు.